Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' చిత్రాల ఘన విజయాలతో టాలీవుడ్‌లో ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్‌కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే తప్పకుండా హిట్ అనే నానుడి కూడా ఉంది. ఏడేండ్ల గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్‌లో ఓ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఆ సస్పెన్స్‌కి తాజా సమాచారం తెర దించిందని వేరే చెప్పక్కర్లేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో ఏ తరహా నేపథ్య సినిమా రాబోతోందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవకుశ'చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్‌సిగల్ ఇచ్చారు. అయితే ఈ చిత్రం కంటే ముందే రాజమౌళి చిత్రంలో ఎన్టీఆర్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. ఏదిఏమైనా డబుల్ హ్యాట్రిక్ హిట్ కోసం ఈ కాంబో రంగానికి సిద్ధమైందన్నమాట.