Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత జనరేషన్‌ని ప్రతి బింబించేలా పెళ్లి, సహ జీవనంలో ఉన్న రెండు జంటల కథతో రూపొందిన చిత్రం 'మ్యాడ్'. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్ బ్యానర్ పై లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కష్ణారెడ్డి నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథిగా హాజరై ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ, 'మీడియా ప్రోత్సహిస్తే మామూలు సినిమా, బెటర్ సినిమా అవుతుంది. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడి ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం' అని చెప్పారు. మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, 'ఇవాళ యూత్ లైఫ్‌లో జరుగుతున్న కాంటెంపరరీ కాన్సెప్ట్ ఉంటుంది. ట్రైలర్ బాగుంది' అని తెలిపారు. నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 'మా సినిమా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది' అని చెప్పారు. సంగీత దర్శకుడు కేఎం రాధాకష్ణ మాట్లాడుతూ, 'కమర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్‌హిట్ అవుతుంది' అని తెలిపారు.