Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రోహిత్ నందన్, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా రూపొందిన పాట 'లడిలడి..'. ఈ పాట తాజాగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకలు నుంచి విశేషాదరణ పొందుతోంది. ప్రస్తుతం ఈ పాట య్యూటూబ్ తో పాటు ఇతర సంగీత మాధ్యమాల ద్వారా శ్రోతల్ని విశేషంగా అలరిస్తోంది. ఈ సందర్భంగా యువ నటుడు రోహిత్ నందన్ మాట్లాడుతూ, 'మెగాస్టార్ చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుని డాన్స్, నటన తదితర సినిమా విభాగాల్లో శిక్షణ తీసుకున్నాను. స్నేహితుడు శ్రీచరణ్ పాకాలతో కలిసి ఈ 'లడిలడి' పాటకు సంబంధించిన కార్యచరణ సిద్ధం చేశాను. ఆ తర్వాత ఇంటర్నెట్ సెన్సేషనల్ ప్రియా ప్రకాష్ వారియర్‌ను, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌ని ఈ పాట కోసం తీసుకున్నాం. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ తన డాన్సింగ్ స్కిల్స్‌తో, లిరిక్ట్ రైటర్ విస్సాప్రగడ తన రైటింగ్‌తో మరో లెవెల్‌కి తీసుకెళ్ళారు. ఈ పాట ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. ఆమె ఈ పాటలో ఆడటమే కాదు, పాడారు కూడా. తొలిసారి చేసిన ఈ ప్రయత్నాన్ని తెలుగు ఆడియెన్స్ విశేషంగా ఆదరించడం, యూట్యూబ్‌లో ఈ పాటకు మిలియన్ పైగా వ్యూస్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. త్వరలోనే హీరోగా ఓ ప్రముఖ దర్శకుడితో తెలుగు చిత్ర సీమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాను. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది' అని చెప్పారు.