Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మొదటిసారిగా పడిపోయిన వైనం
న్యూఢిల్లీ : ఎల్‌పీజీ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీ 'సున్నా'కు చేరింది. గత కొన్ని సంవత్సరాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత కొన్ని నెలలుగా రాయితీపై ఇచ్చే సిలిండర్ల ధరను కేంద్రం పెంచుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇటీవల పడిపోవడం... ఈ రెండు అంశాల వలన గత కొన్ని సంవత్సరాలతో చూసుకుంటే మొదటిసారి 'సున్నా' సబ్సిడీకి దారితీసింది. దీనికి సంబంధించి నోమురా నివేదికలో వెల్లడించిన గణాంకాల ప్రకారం ఆయిల్ కంపెనీలు మే నెలలో ప్రతి సిలిండర్‌పై రూ.120 రికవరీ చేసే అవకాశం ఉంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని 2015, జనవరిలో ప్రారంభించారు. దీని ప్రకారం సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్లకు సంబంధించి వినియోగదారులు మార్కెట్ రేటు ప్రకారం మొత్తం ధరను చెల్లిస్తే ప్రభుత్వం తరువాత రాయితీ మొత్తాన్ని సదరు లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. అంతకు మునుపటి పాత పద్ధతి ద్వారా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్లను వినియోగదారులకు తక్కువ ధరకు అమ్మడం ద్వారా వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రభుత్వం చెల్లించే నిధులపై అధారపడేవి. దీన్నే పారిశ్రామిక పరిభాషలో 'అండర్ రికవరీ' అని పిలిచేవారు.
అయితే డీబీటీ పథకం వచ్చిన తర్వాత సబ్సిడీయేతర సిలిండర్ ధర మార్కెట్ ధర కన్నా అధికంగా నిర్ణయించిన సమయంలో ఈ అండర్ రికవరీ అనేది అవసరం లేదు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందేందుకు సంబంధించి పేదలకు రూ.1600 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించబడిన పీఎం ఉజ్వల్ యోజన పథకాన్ని ప్రమోట్ చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం 2017, అక్టోబర్, 2019, జులై నెల మధ్య సబ్సిడీయేతర సిలిండర్ల ధరలను స్తంభింపచేసింది. ఈ నేపథ్యంలో ఈ అండర్ రికవరీని పూర్తిగా సమర్ధవంతగా తప్పించలేక పోయారు. దీని వలన ఎల్‌పీజీ సిలిండర్ పూర్తి ధర వాస్తవ ధర కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 2019, జులై నాటి నుంచి సబ్సిడీయేతర సిలిండర్ల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచుకుంటూ వచ్చాయి. ఉత్పత్తి సమృద్ధి, కరోనా నేపథ్యంలో డిమాండ్ పడిపోయిన కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీని వలన అండర్ రికవరీల నుంచి చివరకు అధిక రికవరీల పరిస్థితులకు దారితీసింది. సౌదీ ఎల్‌పీజీ దిగుమతి సమాన ధర ఆధారంగా ఎల్‌పీజీ సిలిండర్ మార్కెట్ ధర నిర్ణయించబడుతుంది. బాట్లింగ్ ఖర్చులు, రవాణా, డీలర్ కమిషన్, లాభం, జీఎస్టీ మొదలైన ఫిక్స్ చేయబడిన అంశాలను కూడా ధరను నిర్ణయించడంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఎల్‌పీజీ సిలిండర్ పూర్తి ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెలా మారుస్తాయి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం విడగా నిర్ణయిస్తుంది.