Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విషమ పరిస్థితిలో మహిళ
లక్నో : యూపీలో మహిళలకు భద్రత కరువైంది. వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. బుధవారం రాత్రి 30 ఏండ్ల మహిళపై లైగికదాడి అత్యాచారం ఘటన మరువక ముందే శుక్రవారం మరో లైంగికదాడి ఘటన జరిగింది. ఒక మహిళపై తండ్రి, కుమారుడు అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం నిప్పంటించారు. ఈ దారుణం యూపీలోని సీతాపూర్‌లోని మిశ్రీఖీ ప్రాంతంలో జరిగింది. తీవ్ర గాయాలైన మహిళను స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్టు సీతాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆర్‌పి.సింగ్ తెలిపారు. సిథౌలి ప్రాంతంలోని తన తల్లి ఇంటి నుంచి మిశ్రీఖ్‌కు వెళుతున్న మహిళ అదే దారిలో వెళుతున్న ఇద్దరు తండ్రి, కుమారులు ఆ మహిళపై 55 ఏండ్ల వ్యక్తి, అతని కుమారుడు దారుణానికి ఒడిగట్టారనీ, అనంతరం మహిళకు నిప్పంటించినట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు.