Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలహాబాద్ : హిందూ మహాసభ నాయకుడు అశోక్ కుమార్ పాండేపై ఎఫ్‌ఐఆర్ రద్దుకు అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. అలీ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంతోపాటు, దాని వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్‌పై మతతత్వ ఆరోపణలకు సంబంధించి పాండేపై ఇటీవల ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇందుకు తిరస్కరించింది. అరెస్టుపై స్టే ఇచ్చేందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది. ఏఎంయూ ఉగ్రవాదులను తయారు చేసే సంస్థలనీ, అందులోని విద్యార్థులు 'ఉగ్రవాదులు' అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.