Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోం పర్యటనలో ప్రధాని మోడీ
గువహతి: గత ప్రభుత్వాలు అసోం ప్రజల హక్కులను హరించాయని ప్రధాని మోడీ అన్నారు. శనివారం ఆయన అసోంలో పర్యటించారు. దీనిలో భాగంగా శివసాగర్ జిల్లాలో 1.06 లక్షల మంది ఆదివాసీలు, నిర్వాసితులకు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభి.. పలువురికి పట్టాలను అందించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పాలించిన గత ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల హక్కులను హరించాయని ఆరోపించారు. ''రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అసోంలో 6లక్షల మందికి పైగా ప్రాదేశిక కుటుంబాలకు తమ భూములపై చట్టపరమైన హక్కులు లేవు. కానీ శర్వానంద సోనోవల్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత రెండేండ్లలో రెండు లక్షల మందికి పైగా కుటుంబాలకు భూమి పట్టాలు అందించారు. ఇప్పుడు మరో లక్ష కుటుంబాలకు భూహక్కులు కల్పిస్తున్నారు. అసోం ప్రజల భూమి, భాష, సంస్కతి సంప్రదాయాలను కాపాడేందుకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది'' అని మోడీ అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకుందని రాష్ట్ర సర్కారుపై ప్రశంసలు కురిపించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సైతం విజయవంతం చేస్తుందని తాను ఆశిస్తున్నానని మోడీ అన్నారు. టీకాలు అందరూ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు గుర్తించి, దానికి అనుగుణంగా తమ ప్రభుత్వం వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.