Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు స్థాయిలో ఢిల్లీలో పెట్రోల్ ధర
న్యూఢిల్లీ : వాహనదారులపై పెట్రో బాదుడు కొనసాగుతున్నది. శుక్రవారం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 25 పైసలకు చమురు సంస్థలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.45లకు చేరువై..రికార్డును సష్టించింది. ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు. పెట్రోల్ గురువారం ధర రూ.85.20గా ఉంది. మరోవైపు డీజిల్ ధర రూ. 75.63 పెరిగింది. ముంబయిలో పెట్రోల్ ధర అత్యధికంగా రూ.92.04కు చేరుకుంది. కోల్‌కతాలో రూ.86.87, చెన్నైలో రూ.88.16, హైదరాబాద్‌లో 88.89గా ఉంది. డీజిల్ ధర ముంబయిలో రూ.82.40, కోల్‌కతాలో రూ.79.23, చెన్నైలో రూ.80.99, హైదరాబాద్‌లో రూ.82.53కి చేరింది.