Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన కొనసాగుతున్నది. ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన రైతులు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఆందోళనచేస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన మంగళవారం నాటికి 48వ రోజుకు చేరుకున్నది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా సింఘు, టిక్రి, పల్వాల్, ఘాజీపూర్, నోయిడా, షాజహాన్‌పూర్ సరిహద్దుల్లోనూ, బురారీ మైదానంలోనూ రైతులు తమ ఆందోళన కొనసాగించారు. దళిత్ విత్ ఫార్మర్స్ అంటూ పోస్టర్స్, బ్యానర్స్ వెలిశాయి. రైతుల వెంట దళితులు కూడా ఉన్నారని సందేశాన్ని ఇచ్చేందుకే తాము ఈ కార్యక్రమానికి నాంది పలికామని నిర్వహకులు పేర్కొన్నారు. ఫార్మింగ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నుంచి ఎంపీలు ప్రతాప్ సింగ్ బజ్వా, సుఖ్‌దేవ్ సింగ్‌లు థినదాస్ వాకౌట్ చేశారు.