Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం హామీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తి...
- మంత్రి, ఎమ్మెల్యే హామీలు ఉత్తివేనా..?
- ప్రత్యేక రాష్ట్రంలోనూ మారని బతుకులు
నవతెలంగాణ- పెద్దవూర
చెంతనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా..కనీసం తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితి.ఇక్కడి నీళ్లు హైదరాబాద్,జంటనగరాలకు,మరోపక్క నల్లగొండ జిల్లా,ఇంకో పక్క సూర్యాపేటకు తాగునీటిని అందిస్తున్నారు.కానీ .పక్కనే ఉన్న మాకు సాగు,తాగు నీరందడం లేదని గిరిజనపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దశాబ్దాల కాలంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. గత పాలకులు నెల్లికల్ లిఫ్ట్ ఏర్పాటు చెయలేక పోయారు దాంతో ఎన్నికల సభలో హాలియాలో జరిగిన సభలో సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ ఎన్నికల్లో నోముల నర్సింహయ్యను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెల్లికల్,ఎత్తిపోతలు, కుంకుడుచెట్టు లిఫ్టు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, హామీ ఇచ్చి ఏడాదవుతున్నా ఇంకా ఎన్నాళ్లు సాగునీటి గోసపడాలని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడితే..
తెలంగాణ ఏర్పడితే మన నీళ్లు,మననిధులు,నియామకాలు ఉంటాయిని, వనరులు ఉన్నచోట లిప్టులు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఇచ్చారు.హామీ ఇచ్చి ఆరేండ్లవుతున్నా అతీగతీ లేదు. దీంతో నెల్లికల్ ఎక్స్‌రోడ్డు, సాగర్-హైదరాబాద్ రహదారిలో 3వేల మంది గిరిజనులు మహాధర్నా నిర్వహించారు. అయినా ఫలితం లేదు.
అంతరాష్ట్ర్ర నదీ జలాల ఒప్పందం
అంతర్జాతీయ నదీజలాల ఒప్పందం ప్రకారం కృష్ణా, రివర్ బోర్డు,బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కమిటీ కూడా కృష్ణానది పరివాహక వాసులకు సాగు, తాగునీరందించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు అందించాలని సిఫార్సు చేశారు.కాలువల ద్వారా లిఫ్టులు ఏర్పాటు చేసి నీరందించాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొన్నారు.గత పాలకులు, ప్రస్తుత పాలకుల వల్ల కృష్ణపట్టె నేడు కష్టాల పట్టెగా మారిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
దశాబ్దాల కిందే..
దశాబ్దాల కిందటే నెల్లికల్ ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదన సిద్ధమైంది. కానీ అటవీశాఖ అనుమతులకు నిరాకరించడంతో ఆశలు నీరుగారాయి.40 ఏండ్లుగా సాగునీళ్లు లేక పంటపొలాలు బీళ్లుగా మారాయి.మాజీ సీఎం వైఎస్సాఆర్ హయాంలోనే ఈ లిఫ్టుకు సంబంధించి డాక్యుమెంట్లను ఇంజనీరింగ్ అధికారులకు పంపించారు. ఆయన మరణానంతరం మాజీ సీఎం కిరణ్‌కుమార్ హయారలో ఫైల్‌కు కదిలిక వచ్చింది. అయితే అటవీశాఖ అనుమతులు నిరాకరించడంతో ఆగిపోయింది.
లిప్టు పూర్తయితే...
ఈ లిఫ్ట్ పూర్తయితే కృష్ణపట్టె ప్రాంతాలైన నెల్లికల్, ఎర్ర చెర్వుతండా, పిల్లిగుండ్లతండా, జాల్‌తండా, చెంచువానికాలనీ, మూలతండాల్లో 6 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. గోడుమరక, బట్టువెంకన్నబావితండా, చెన్నాయి పాలెం, సపావట్‌తండా, తిమ్మాయిపాలెం, నాగార్జునపేట, జమ్మనకోట, చింతల పాలెం, తునికినూతల, ఇర్కితండాల్లో మరో నాలుగు వేల ఎకరాలకు సాగు నీరందుతుంది.అంతేగాకుండా భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు చెరువుల్లో నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవికాలంలో తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. పశువులు, మూగజీవాలకు పశుగ్రాసం లేక వాటిని అంగంట్లో అమ్ముకోవాల్సి వస్తుంది. లిఫ్టు పూర్తయితే అవంతరాలు లేకుండాపోతాయని గిరిజనులు తెలుపుతున్నారు.
సీఎం హామీ ఏమయే..
ఎస్‌ఎల్‌బీసీ లోలెవల్ డిస్ట్రిబ్యూటరీ 8,9 పరిధిలో కుంకుడుచెట్టుతండా, బోనూనతల, ఘాత్‌తండా, తూటిపేటతండా, రంగుళ్ల తండా, ఎల్లాపురంతండాలో రైతులకు 8 వేల ఎకరాలకు సాగునీరందుతుంది.ఈ రెండు లిప్టులు పూర్తయితే సాగర్ నియోజకవర్గంలో వలసలు లేకుండా ఉంటాయని గిరిజనులు కోరుతున్నారు. ప్రతి ఏడాదీ పదుల సంఖ్యలో కుటుంబాలు వలసెళ్లుతున్నాయి.
డి-8,9 కుంకుడుచెట్టుతండా లిఫ్టు ఏర్పాటు చేయాలి:సర్పంచ్, రమావత్ ప్రియాంక
కుంకుడు చెట్టు తండా లిప్టు ఏర్పాటు చేయాలి.గతఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హాలియాలో జరిగిన సభలో హామీ ఇచ్చారు. దీని పరిధిలో సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమి సాగు కానుంది.పూర్తి చేసి నీటిని అందించాలి.
ఇచ్చిన హామీని అమలుచేయాలి:మునిలాల్,నాయకునితండా, సర్పంచ్
రూ.కోటితో నెల్లికల్ లిఫ్టుపనులు ఏర్పాటు చేస్తే గిరిజనుల కష్టాలు తప్పుతాయి.10 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది.ఈ విషయమై అనేకసార్లు ధర్నాలు నిర్వహి ంచాం. దశాబ్దాల కాలంగా గిరిజనులు వలసలు వెళ్తున్నారు.లిఫ్టు ఏర్పాటు చేయాలని నవంబర్ 6న నెల్లికల్ స్టేజీ వద్ద మహాధర్నా కూడా నిర్వహించాం. అయినా అధికారులకు కనువిప్పు కలగలేదు.రెండు లిఫ్టుల పూర్తయితే కృష్ణపట్టె వలసలు నివారించొచ్చు.