Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లిరూరల్
పాస్టర్లకు గౌరవ వేతనం ప్రకటించాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్‌సీసీ) రాష్ట్ర అధ్యక్షుడు అలవాల కరుణాకర్ కోరారు. స్థానిక ఎన్‌సీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పాస్టర్ల సమావేశం ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమం కోసం కృషిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 16 జేవీఆర్ కళాశాలలో నిర్వహించనున్న సెమీక్రిస్మస్ వేడుకలను జయప్రదం చేయాలన్నారు. అనంతరం క్రైస్తవ సోదరులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఏ.శ్యామ్‌సన్, మండలాధ్యక్షుడు విజయకుమార్, జిల్లా పొలిటికల్ వింగ్ నడ్డి ఆనందరావు, కోశాధికారి పీ.రవికిరణ్, ఉపకోశాధికారి ఎన్.సుధాకర్, బీ.కరుణతేజ్ పాల్గొన్నారు.