Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడ
ఇండియన్ నేషనల్ మేథమ్యాటిక్ ఒలంఫియాడ్‌కు ఎస్‌ఆర్‌ఎమ్ పాఠశాలకు చెందిన సీహెచ్ రాకేష్‌రెడ్డి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాడెంట్ కేశినేని శ్రీదేవి గురువారం విలేకర్లకు తెలిపారు. హోమిబాబా సెంటర్ ఫర్ సైన్స్ హెడ్యుకేషన్, టాటా ఇనిస్ట్ట్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రీసెర్చ్ ముంబాయి, నేషనల్ బోర్డు ఫర్ హైయర్ మ్యాధమ్యాటిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ ఏడు అక్టోబర్ 6న నిర్వహించిన ఆర్‌ఎంవో (రీజనల్ మ్యాధ్స్ ఒలంఫియాడ్) పరీక్షకు తెలంగాణా నుంచి ఎస్‌ఆర్‌ఎమ్ పాఠశాల నుంచి ఎంపికైయ్యాడని వచ్చే జనవరి 19 జరిగే ఇండియన్ నేషనల్ మ్యాధ్స్ ఒలంఫియాడ్ పరీక్షలో తెలంగాణా నుంచి రాకేష్‌రెడ్డి పాల్గొంటున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా రాకేష్‌రెడ్డిని కోదాడ ఎంఈవో గోపతి గోపయ్య, పాఠశాల కరస్పాడెంట్ శ్రీదేవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.