Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమంగా మైనింగ్ చేయలేదు : నాగార్జున పరిశ్రమ ప్రెసిడెంట్ చక్రధర్
నవతెలంగాణ-మఠంపల్లి
నాగార్జున సిమెంట్ పరిశ్రమ స్థాపించిన దగ్గర నుంచి అక్రమ మైనింగ్ చేయలేదని పరిశ్రమ ప్రెసిడెంట్ చక్రధర్ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 30 ఏండ్ల క్రితం పరిశ్రమ స్థాపించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడతున్నామన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. సీఎస్‌ఆర్ కింది విభాగం పొరపాటు వల్ల చట్టవిరుద్దమైన మైనింగ్ చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. మైనింగ్ అధికారులే స్వయంగా తమ పరిశ్రమ ఎటువంటి చట్ట విరుద్దమైన మైనింగ్, రాయల్టీలు ఎగవేతలు లేవని నిర్ధారించారన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిండెంట్ జానకిరాం, సీనియర్ జనరల్ మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు.