Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
దిశ నిందితులను కఠినంగా శిక్షించి, ఉరి తీయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోపబోయిన నాగమణి కోరారు. మహిళలపై అత్యా చారాలు, హత్యలు అరికట్టాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహిం చారు. దిశ మృతికి నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కా శ్రీనివాసచారి, శ్రీనివాసరెడ్డి, కె. విజయలకి, లచ్చయ్య, పాల్గొన్నారు.
చండూరు : దిశ దుర్ఘటనపై ట్రస్మా ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ స్థానిక గాంధీ విద్యాసంస్థలు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, జడ్పీ హైస్కూల్, మరియా నికేతన్ స్కూల్ కలిసి విద్యా ర్థులు గురువారం నిరసనగా తెలిపారు. చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎర్ర గిన్నెల రవీందర్, జెడ్పీహై స్కూల్ హెడ్మాస్టర్ కరుణాకర్ రెడ్డి, ఏ ఎస్‌ఐ దుర్గా రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టస్మా మండల అధ్యక్షుడు గొట్టిపర్తి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్ బాబు, స్కూల్ కరస్పాండెంట్, డాక్టర్ కోడి శ్రీనివాసులు విద్యార్థులు పాల్గొన్నారు.
మునుగోడు : దిశ, మానస చంపిన దుండగులను వెంటనే శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని హై స్కూల్ నుండి చండూర్ రోడ్డు వరకు విద్యార్థులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుమార్, నాయకులు మహేష్, యశ్వంత్, శివ, శ్రీకాంత్, గణేష్, అశ్విని ఉన్నారు.
మునగాల : 'దిశ' ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మహిళా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు సిహెచ్ సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, మండల కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి, ఎంపీపీ ఎలకా బిందు నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఉప్పుల రజిత జానికిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, తహసీల్దార్ పాండు నాయక్, మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్, కాంగ్రెస్, సీపీఐ నాయకులు కొప్పుల జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
కోదాడ : దిశ పై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర విచారణ జరిపి కఠిన శిక్ష విదించాలని పబ్లిక్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర సత్యనారాయణ, గడ్డం విద్యాసాగర్‌రెడ్డిలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం పబ్లిక్ క్లబ్‌లో దిశ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కె. విద్యా సాగర్‌రావు, వేనేపల్లి వెంకటయ్య, మేకల వెంకట్రావ్, కత్రం భాస్కర్‌రెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు.