Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్ పల్లి
రోడ్డు ప్రమాదంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమ్మనబోలు ఫీల్డ్ అసిస్టెంట్ భూమ నరేష్ (32) మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేష్ బుధవారం సొంత పని నిమిత్తం నల్లగొండకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అమ్మనబోలు గ్రామ శివారులో గల రైస్ మిల్లు వద్ద ద్విచక్రవాహనంపై నుండి అదుపుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య నిర్మల ఇచ్చిన ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.