Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఈనెల 12, 13న ఢిల్లీలో జరిగే మాదిగల ఆందోళనను జయప్రదం చేయాలని టీఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నత్తి కృష్ణమాదిగ అన్నారు. గురువారం మండల కేంద్రంలో బాబుజగ్జీవన్‌రాం విగ్రహం ముందు కరపత్రాలను విడుదల చేశారు. మాదిగలు ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేస్తుంటే నేటి కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపడిశాల ఉపసర్పంచ్ బందెల ప్రమోద్ మాదిగ, శ్రీహరి మాదిగ, సోమ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి రూరల్:లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దేశంలోని గోర్ ప్రజలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్షులు రాజేశ్‌నాయక్ కోరారు. గురువారం స్థానిక ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి భాస్కర్‌నాయక్, నాయకులు బాబురావునాయక్, గోపాల్, లింగా, మదన్, వినోద్, అనీల్ పాల్గొన్నారు.
ఆత్మకూర్(ఎం):ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని టిఎస్ ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో ఈనెల 12, 13 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమంలో మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో చలో ఢిల్లీ మాదిగల లొల్లి అనే కరపత్రాన్ని వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరికుంట్ల గణేష్, రవిందర్, స్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.