Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
వరి కోత ప్రయోగాలతో పంట దిగుబడులు అంచనా వేయొచ్చని డివిజన్ ఉప గణాంకాధికారి లస్కర్ అన్నారు. గురువారం మండలంలోని వెల్మగూడెం గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి వరికోత ప్రయోగాలు నిర్వహించి మాట్లాడారు. డివిజన్‌లో అన్ని రెవెన్యూ మండలాల్లోని ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రయోగాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వరికి 5.5 మీటర్లు, కందికి 10.10 మీటర్లు ప్లాట్లలో వరి కోత ప్రయోగాలు నిర్వహించుకోవాలన్నారు. నిర్వహించిన ప్రయోగంలో 17.650 కేజీల దిగుబడి వచ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట ఎంపీఎస్‌ఓ రావుల సాలయ్య, ఏఈఓ రాము, రైతులు పాల్గొన్నారు.