Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
ఇటీవల మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామానికి చెందిన మాతంగి నర్సయ్య(38) రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అతని కుటుంబానికి హైదరాబాద్‌కు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారి సహాయార్ధం ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ అంజపెళ్లి నాగమల్లు రూ.10వేల ఆర్థిక సాయంను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నర్సయ్యకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేక కన్నబిడ్డలను ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించి బతుకుదెరువు కోసం హైదరాబాద్ పట్టణం వెళ్లి జీవనం సాగిస్తున్న నర్సయ్య తన భార్య నర్సమ్మతో కలిసి సొంతగ్రామం గ్రామానికి వచ్చి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో నర్సయ్య అక్కడికక్కడే మృతిచెందాడని, అతని భార్య నర్సమ్మ చావుబతుకులు మధ్య హైదరాబాద్‌లోని గాంధీ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. వారి పిల్లల దయనీయ పరిస్థితి తెలుసుకొని హెల్పింగ్ హాండ్స్ సంస్థ వారికి సమాచారం ఇవ్వడంతో వారు ముందుకు వచ్చి సహాయం అందించడం అభినందనీయమన్నారు. మృతడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారికి మానవతా దృక్పథంతో సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి టైసన్, శ్రీశైలం, శివ, అరుణ్ పాల్గొన్నారు.