Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
ప్రభుత్వ విధానాల వల్ల నిర్వీర్యమవుతున్న విద్యను కాపాడుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆ సంఘం మండల మహాసభ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్య చైతన్యయాత్రలను టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర శాఖ తరపున వచ్చే నెలలో నిర్వహిస్తా మన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన ఐఆర్, పీఆర్సీ, ప్రమోషన్ల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 17న జరిగే టీఎస్‌యూటీఎఫ్ జిల్లా విద్యాసదస్సు పోస్టరావిష్కరించారు. అనంతరం మండల కమిటీని ఎన్నికల అధికారి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, గేర నర్సింహా ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండలా ధ్యక్షులుగా చిలువేరు నారాయణ, ప్రధాన కార్యదర్శిగా బూషిపాక రఘుపతి, ఉపాధ్యక్షు లుగా కృష్ణవేణి, జంపాల అనిల్‌కుమార్, కోశాధికారిగా కృష్ణయ్యలతో పాటు, మరికొంతమందిని ఎన్నుకున్నారు.