Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
నిరుపేదల అభ్యున్నతి కోసం గోద యాదగిరి ఆశయాలు చాలా గొప్పవని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలోని పార్టీ కార్యాలయంలో గోద యాదగిరి వర్ధంతి సభ ఆ పార్టీ నాయకుడు కోకల రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ భూ స్వాములపై తిరుగుబాటు చేసి అట్టడుగు వర్గాలకు ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు పంచిన ఘనత ఆయనదే అన్నారు. యాదగిరిగుట్టలోని ఆర్టీసీ డిపోకు స్థలం కేటాయించడానికి యాదగిరి కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. పార్టీ సీనియర్ నాయకుడు పేరబోయిన పెంటయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బబ్బూరి నాగయ్య, ఆ పార్టీ జిల్లా కార్యవర్గసభ్యులు కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, గోరేటి రాములు, ఎమ్‌డి.ఇమ్రాన్, బీసీ సబ్‌ప్లాన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కల్లెం కృష్ణ, ఏశాల అశోక్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్, నాయకులు బండపల్లి నర్సయ్య, పేరబోయిన బల్లారి, చందూనాయక్, బొల్లారం సోమయ్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.