Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దూరు
సీసీరోడ్ల బిల్లులు చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండలంలోని లింగాపూర్ మాజీ సర్పంచ్ సంధిటి లక్ష్మిరెడ్డి మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ చట్టం 2014-15లో గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు అయ్యాయని ఆమె తెలిపారు. సీసీ రోడ్ల పనులు చేస్తే ప్రభుత్వం 20 శాతం కట్ చేసిందని, 20 శాతం కటింగ్ అయిన రూ.71 వేలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలు అకౌంట్లోలో 31 జనవరి 2019న జమ చేసిందని ఆమె తెలిపారు. తనకు రావాల్సిన రూ.71 వేలు చెల్లించాలని ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌వర్మకు పంచాయతీ కార్యదర్శి అఫ్జల్‌కు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకో వడంలేదని ఆమె తెలిపారు. తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అధికారులను కోరగా ఒకసారి చెకు బుకు రాలేదని, మాకు సంబంధం లేదని అని అధికారులు అంటు న్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచ్‌కు సూచించాం..
లింగాపూర్ మాజీ సర్పంచ్ సందిటి లక్ష్మిరెడ్డికి సీసీ రోడ్డు బిల్లు రూ.71వేలు మంజూరయ్యాయి. గ్రామపంచాయతి అకౌంట్ లో జమయ్యాయి. వాటిని చెల్లించాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు సూచిం చాం. బిల్లులు చెల్లించని పక్షంలో పంచాయతీ కార్యాలయానికి నోటీస్ ఇస్తాం. మూడు రోజుల్లో మాజీ సర్పంచ్‌కి సీసీ బిల్లు చెల్లించకుంటే సర్పంచ్, కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.
- ఈఓ పీఆర్డీ శ్రీనివాస్‌శర్మ