Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
సిద్దిపేట అర్బన్‌లోని బురుగుపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఆదివారం రాత్రి ఎన్నుకున్నట్టు మండల ఇన్‌చార్జి రమేశ్ తెలిపారు. బూరుగుపల్లి నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బందెల కనకయ్య, ఉపాధ్యక్షునిగా కొమ్ము కనకయ్య, బందెల శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శిగా బందెల రాజు, సడిమేల్ల బాలకిషన్, అధికార ప్రతినిధిగా బందెల అశోక్, సహాయ కార్యదర్శిగా గౌరీగాని శ్రీకాంత్, కోశాధికారి బాబు, ప్రచార కార్యదర్శిగా సడమెల్ల పోచయ్య, సంయుక్త కార్యదర్శి అరవింద్, కార్యదర్శి పుల్లూరి రాజు, కార్యవర్గ సభ్యులుగా నరసింహులు, శ్రీను, అజరు, రాజు, గౌరవ సలహాదారులుగా యాదగిరి, సుంచు మహేశ్‌లను ఎన్నుకున్నట్టుగా తెలిపారు.
టీ ఎమ్మార్పీఎస్ 'చలో ఢిల్లీ' కరపత్రావిష్కరణ
సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి జిల్లాలో టీ ఎమ్మార్పీఎస్ 'చలో ఢిల్లీ' కరపత్రాన్ని సంగారెడ్డి జిల్లా స్థానిక ఐబీలో టి ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం విడుదల చేశారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని చలో ఢిల్లీని నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ అఖిలపక్షానికి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే కోరారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సంగారెడ్డి జిల్లా స్థానిక ఐబీలో టీ ఎమ్మార్పీఎస్ నాయకులు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డప్పు రాజు మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి మాదిగ, మహేందర్, అరునక్క, రమేశ్, కిషోర్, రాజు, నర్సింగరావు, రవీందర్, దుర్గయ్య ఆవిష్కరించారు.