Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జడ్చర్ల
బాదేపల్లి మున్సిపాల్టీ పేరును జడ్చర్ల మున్సిపాల్టీగా మార్చారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ సునిత శనివారం నవతెలంగాణకు తెలిపారు. ఇదిలా ఉండగా బాదేపల్లి పురపాలిక కార్యాలయంగా ఉన్న బోర్డును జడ్చర్ల పురపాలిక కార్యాలయంగా రాయించటంతో పాటు గతంలో ఉన్న ఈ మెయిల్ ఐడీని జడ్చర్ల మున్సిపాల్టీ ఎట్‌దరేట్ జీమెయిల్.కామ్‌గా మార్చినట్టుగా తెలిపారు.