Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ కలెక్టరేట్
వైజ్నానిక ప్రదర్శనలవల్ల పిల్లల్లో వినూతన ఆలోచనలు పుట్టుకొస్తాయని, తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుందని కలెక్టర్‌రోనాల్డ్ రోస్ అన్నారు. స్థానికప్రభుత్వ మాడల్ బేసిక్ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన జవహార్‌లాల్ నెహ్రూ 47వ గణిత, పర్యావరణ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి పరిశోధనల గురించి అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో సైన్స్ ఎగ్జిభిషన్‌లు ఏర్పాటు నిర్వహించాలని, ఆధునిక శాస్త్ర రంగాల్లో వస్తున్న మార్పులను, ఎదురవుతున్న సమస్యలను విద్యార్థులు తేలికగా అర్థం చేసుకుంటారని తెలిపారు. గొప్ప వ్యక్తులు, శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకుని శ్రద్దగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన ముగింపుసభలో డీఈఓ ఉషారాణి మాట్లాడుతూ భవిష్యత్‌లో ఎదురయ్యే పర్యావరణ సమస్యలకు పరిస్కారం చూపేలా వైజ్ఞానిక ప్రదర్శనలుండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, శాస్త్రవేత్తలను స్పూర్తిగా తీసుకుని ముందుకెల్లాలని సూచించారు. అనంతరం రాష్ట్ర స్థాయికి ఎంపికైన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీ ఎస్ ఓ మురలిమనోహన చారి, రెడ్క్ క్రాస్ సోసైటీ కోశాధికారి జగపతిరావు,ఏ ఎం ఓ హేమచందుడు ఎం ఈ ఓ జయశ్రీ, ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు ప్రభాకర్, మాడల్‌బేసిక్ ఫ్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊర్మిళాదేవి పాల్గొన్నారు.