Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి
- అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నవతెలంగాణ-అచ్చంపేట
పత్తి రైతులు దళారులను నమ్మి మోసపొవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రబీ, ఖరీఫ్‌లో సాగు పెంచేందుకు ప్రత్యేకంగా కేఎల్‌ఐ కాలువల ద్వారా సాగురందిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, మండల సమితి అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పర్వతాలు, మాజీ జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నరసింహగౌడ్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సరోజ, సిబ్బంది శ్రీధర్, నరేష్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.