Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నవతెలంగాణ- నాగర్‌కర్నూల్
పేద విద్యార్థుల చదువును దూరం చేసే విధంగా ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందులో భాగంగానే ఇంటర్ విద్యా రేషనలైజేషన్ చేస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ విమర్శించారు. బుధవారం నిర్వహించిన ఎస్‌ఎప్‌ఐ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఇంటర్‌మీడియట్ విద్యా అంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉందని కార్పొరేట్ కళశాలలకు అడ్డుకట్ట వేయకుండా పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ కళాశాలలను రేషలైజేషన్ చేయడం దారుణమన్నారు. ఇంటర్ చదవాలంటే పేద ప్రజానీకం తమ పిలల్ని చదివిండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యకు సరైన ప్రాధాన్యతా నిధులు ఇవ్వకుండా విద్యార్థులు లేరనే పేరుతో కళాశాలలను మూసి వేయడం ప్రయివేటు శక్తులకు కొమ్ము కాయడమే అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు జావేద్, క్రాంతి, శ్రీకాంత్ ఉన్నారు