Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగర్ కర్నూల్
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ సంయుక్త కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా 77 ఫిర్యాదులు వచ్చాయి. ఈ దరఖాస్తులను జేసీ శ్రీనివాసరెడ్డి, డీఆర్వో మధుసూదన్ నాయక్ స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదుల్లో భూములకు సంబంధించినవైతే ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా సమస్య లు పరిష్కరించాలని సూచించారు.
నారాయణపేట రూరల్ : కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహిచిన ప్రజావాణికి 48 దరఖా స్తులు వచ్చాయి. భూ సమస్యలకు సంబం ధించి 36, ఇతర 12 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగినా తమ పనులు కావడం లేదని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాడానికి వచ్చామని గోవిందమ్మ, భగవంతు, హుసేప్ప తెలిపారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 75 ఫిర్యాదులకుగాను 45 భూసమస్యలకు సంబంధించిన వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఫిర్యాదులను స్వీకరించిన వారిలో జేసీ స్వర్ణలత, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీడబ్ల్యూఓ శంకరాచారి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.