Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్వకుర్తి/దేవరకద్ర
బైక్‌ను టిప్పర్ ఢ కొన్న ఘటన కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాల గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన నాగరాజు(35) అదే గ్రామానికి చెందిన గౌని పార్వతమ్మ(60) టీవీఎస్ ఎక్సెల్ మోటార్‌సైకిల్‌పై కల్వకుర్తి వైపు వస్తున్నారు. కల్వకుర్తి నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న టిప్పర్ మార్చాల గేట్ సమీపంలో వీరి వాహనాన్ని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. పార్వతమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచె ందింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చినిపోయారని మృతుల కుటుంబసభ్యులు విలపించారు. కేసు దర్యప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మహేందర్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢకొీని పారిశుధ్య కార్మికుడికి గాయాలైన..ఘటన కల్వకుర్తి మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని హరిజన వాడకు చెందిన మబ్బు సైదులు కుటుంబ సభ్యులతో కలిసి లింగసానిపల్లికి బైక్‌పైన అతని భార్య, వదినతో వెళ్తున్నాడు. గ్రామ సమీపంలోకి రాగానే వీర ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో సైదులుకు తీవ్రగాయాలు కాగా, మిగతా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.
జీపు ఢకొీని వ్యక్తి మృతి చెందిన ఘటన దేవరకద్ర మండల కేంద్రంలోని.. స్థానిక పెట్రోల్ బంకు వద్ద శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గణపూర్ మండలానికి చెందిన వేముల యాదయ్య(35) తన ద్విచక్ర వాహనంపై మర్కల్‌కు వెళ్తున్నాడు. దేవరకద్ర నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని జీపు మహబూబ్‌నగర్‌కు వెళ్తుంది. మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద జీపు యాదయ్య వాహనాన్ని ఢకొీంది. దీంతో యాదయ్య తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వచ్చి జీపును స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం యాదయ్య మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.