Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిమ్మాజిపేట
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర కమిషనర్ ఆఫీస్ నుం చి ప్రత్యేకంగా నియమింపబడ్డ వైద్య బృందం సభ్యులు డాక్టర్ మానస, డాక్టర్ జ్యోత్స్నలు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఉన్న పలు రికార్డులను పరిశీలించా రు. ఆస్పత్రికి ఎంతమంది రోగులు వస్తున్నార ని స్థానిక వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నా రు. మండల కేంద్రంలో కోవిడ్‌కు సంబంధిం చిన పరీక్షలెలా నిర్వహిస్తున్నారని తెలుసుకు న్నారు. అలాగే ఏఎన్‌ఎంలు, ఆశాలు కరోనాకు సంబంధించి ఎంత పరిజ్ఞానం ఉందని ఆరా తీశారు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ఫీల్డ్‌లో ఎలా పని చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఏం నేర్చుకు న్నారని, తదితర అంశాలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 15 జిల్లాలలో ఉన్న ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలను సందర్శించామని, ఎక్కడా లేని విధంగా ఇక్కడ రికార్డుల నిర్వహణ చాలా బా గుందని ప్రశంసించారు. అనంతరం వైద్యా ధి కారులు ఏఎన్‌ఎం, ఆశాలతో వివిధ అంశాల పై సమీక్షించారు. సమావేశంలో జిల్లా ఇమ్యు నైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ మంజులా వాణి, వైద్యాధికారి అనుదీ ప్ వర్మ, సూపర్‌వైజర్లు గౌస్, సురేందర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.