Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ కలెక్టరేట్
పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కానందున ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని, ప్రభుత్వ అసమర్థతే అందుకు కారణమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య శుక్రవారం ప్రకటనలో ఆరోపించారు. ఆగస్ట్ 17 నుంచి ప్రతిరోజూ 50శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలని, 20 నుంచి దూరదర్శన్ యాదగిరి టిశాట్ చానల్స్ ద్వారా 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు టీవీలో డిజిటల్ పాఠాలు బోధిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించి నాలుగు రోజులు గడిచినా అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదన్నారు. ఫలితంగా ఉపాధ్యాయులు అయోమయానికి గురౌతున్నారనన్నారు. విద్యాశాఖ నుంచి పంపిన ప్రతిపాదనలు ఇంకా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) పరిశీలనలో ఉన్నాయని, విధాన పరమైన నిర్ణయంతో సీఎస్ సంతకమైతే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి ఆమోదం పొందిన అనంతరం జీఓ విడుదల చేస్తారని తెలుస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 15న ప్రభుత్వ సెలవు, 16న ఆదివారం ఉన్నందున ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయో, 17 నుంచి బడికి వెళ్లాలా లేదా అని ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు.