Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వంగూరు
ఈ ఫొటోలో కన్పిస్తున్న పరిస్థితిని చూస్తే పుష్కరాల కోసం వచ్చిన ప్రజలనుకుంటే పొరపాటు పడినట్లే. వీరంతా మండలం లోని డిండి, చింతపల్లి వాగులో చేపలు పట్టేందుకు వచ్చిన ప్రజలు. ఒక పక్క కరోనా, మరోపక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పొంగిన వాగులు, వంకల మధ్య చేపలు పట్టుకునేందుకు జనం అధిక సంఖ్యలో వచ్చారు. ప్రమాదమని తెలిసినా సరదా కోసం చేపటలు పట్టడం చూస్తుంటే గుండె తరుక్కుపోక మానదు. వరద ప్రవాహం వల్ల ఎవరైనా ముంపునకు గురైతే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల అధికారులు ప్రమాదకర పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.