Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ శృతి ఓఝా
- పంద్రాగస్టు వేడుకలపై అధికారులతో సమీక్ష
నవతెలంగాణ - గద్వాల
జిల్లాలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకో వాలని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా అధికారులను అదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబ ర్‌లో స్వాతంత్య్ర వేడుకల నిర్వాహణ ఏర్పాట్ల కు సంబంధించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభు త్వ విప్ కూచికుళ్ల దామోదార్ రెడ్డి హజరు కానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధన మే రకు ఈ సారి వేడుకలను కలెక్టరేట్ ప్రాంగణ ంలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. అందుకు గానూ ప్రాంగణ పరిసరాలు శుభ్రం చేసి శాని టైజేషన్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను అదేశించారు. ఉదయం 10గంటలకు నిర్వహి ంచే పతాకావిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ ఉదయం 9:45 గంటలకే చేరుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాల యాల్లో పతాకావిష్కరణ చేయాలని సూచిం చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీని వాస్ రెడ్డి, అదనపు ఎస్పీ క్రిష్ణ, ఆర్డీఓ రాము లు, సీపీఓ వెంకటరమణ, మున్సిపల్ కమిష నర్ నర్సింహ్మా, తహసీల్దార్ మంజుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.