Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ సీఈఓ ముసాయిదా బేగం
- పలు అభివృద్ధి పనుల పరిశీలన
నవతెలంగాణ - ఉండవెల్లి
గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని జెడ్పీ సీఈఓ ముసాయిదా బేగం హెచ్చరించారు. ఈ మేరకు మానవపాడు మండలంలోని బోరవెల్లి గ్రామం లో చేపట్టిన రైతు వేదిక నిర్మాణ పనులను బుధవారం జెడ్పీ సీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలోపు నిర్మాణాలు పూర్తి చేయాలన్నా రు. అలాగే వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, కల్లాలు, హరితహారంలో మొక్కలు నాటడం వం టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందులో నాణ్యతా ప్రమాణాలుండేలా చూసు కోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని సూచించారు. ఈమె వెంట పంచాయతీ కార్యదర్శులు స య్యద్ భాష, నాగరాజు తదితరులున్నారు.