Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్
- ప్రకృతి వనాలను పూర్తి చేయాలి
- తెలకపల్లి, పదరలో పర్యటన
నవతెలంగాణ - తెలకపల్లి / పదర
పలు అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్య ం వీడకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు తెలకపల్లి, పదర మండల కేంద్రాల్లో ఆదివారం పర్యటించిన కలెక్టర్ పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక పను లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన పల్లె ప్రగతి పనులను త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన సమయానికంతా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అ లాగే వాటికి సంబంధించిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే పదరలో హరితహారంలో భాగంగా గ్రామ పం చాయతీలో నాటిన మొక్కలను పరిశీలించి అ సంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల్లో ఏ ఒక్క రూ నిర్లక్ష్యం వహించినా సహిందేది లేదని హెచ్చ రించారు. కార్యక్రమంలో తెలకపల్లి పంచాయ తీ ఈవో బాలరాజు, బాల గౌడ్, పదర సర్పం చ్ ప్రవీణ్ కుమార్, కార్యదర్శి ప్రవీణ్, ఎల్లయ్య, కారోబార్ ముకుందరెడ్డి పాల్గొన్నారు.