Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 గేట్లు ఎత్తి నీరు విడుదల
- ఇన్‌ఫ్లో 2లక్షల 27వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 2లక్షల 23,948 క్యూసెక్కులు
- ప్రస్తుతం 8.087టీఎంసీల నిల్వ
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళుల తొక్కుతూ ప్రవహిస్తంది. ఎగువ కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి నుంచి నారాయణ పూర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరు తుండడంతో అదే స్థాయిలో దిగువన ఉన్న జూ రాలకు నీటిని విడుదల చేశారు. దీంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో 28 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నా రు. నారాయణపూర్ నుంచి 2లక్షల 94, 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అదే స్థాయిలో 2 లక్షల 23, 948 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.615టీఎంసీలు కాగా ప్రస్తుతం 8. 087 టీఎంసీల నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 22, 743క్యూసెక్కుల నీటిని పవర్ హౌ స్ ద్వారా వదులుతున్నారు. దీని ద్వారా మూ డు యూనిట్లలో 117మెగావాట్ల విద్యుత్ ఉత్ప త్తి అవుతున్నట్లు అధికారులు తెలిపారు. యథా విధిగా జూరాల నుంచి నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, భీమా -1కు 0, భీమా -2కు 750క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 750 క్యూ సెక్కులు, కుడి కాల్వకు 653 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు - 315 క్యూసెక్కులు, సమా ంతర ప్యానల్ ద్వారా 300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద దిగువ ప్రాంతానికి 2లక్షల 23,948క్యూసెక్కుల నీటి ని వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నిండు కుండలా కోయిల్ సాగర్
దేవరకద్ర : మండల కేంద్రంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు జూరాల నుంచి వరద నీరు రావ డంతో పాటు వర్షాలు పడడంతో నిండుకుం డలా దర్శనమిస్తోంది. ప్రాజెక్టు మొత్తం 35 అడుగుల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 29.4 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు నీటిమట్టం వస్తే షెటర్లు తెరిసే అవకాశం ఉంది. ఈ ఏడాది వర్షాలు సమద్ధిగా కురుస్తుం డడంతో పాటు కోయిలకొండ వాగు నుంచి కూడా నీరు రావడంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూనే ఉంది. వరదల నేపథ్యంలో ధన్వాడ, మరికల్, దేవరకద్ర ప్రాంతాలకు చెం దిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికా రులు హెచ్చరించారు.