Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదర, అమ్రాబాద్‌లో కేసులు
- అప్రమ్తతమైన అధికారులు
నవతెలంగాణ - పదర
నల్లమల అభయారణ్య ప్రాంత పరిధిలో ఉండే పదర, అమ్రాబాద్ మండలా లను కరోనా కలవరం పెడుతోంది. రోజురో జుకూ తీవ్రరూపం దాలుస్తున్న కరోనా పట్ల ప్ర జలు భయాందోళనలు చెందుతున్నారు. అం దులో భాగంగానే శనివారం వైద్యశాఖ ఆధ్వ ర్యంలో కరోనా పరీక్షలు చేశారు. అందులో ఒకే రోజు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమో దు కావడంతో ప్రజలు, కరోనా సోకిన వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు వారికి ఎక్కడి నుంచి సోకిందనే కోణంలో విచారణ చేపట్టారు. గతంలో కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడంతోనే వీరికి కరోనా సోకిందని వైద్యాధికారి గౌతం తెలిపారు. పదరలో ముగ్గురి రాగా అమ్రాబాద్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి ఒకరికి కరోనా వచ్చినట్లు తెలిపారు. ఈ కేసులతో మ ండలంలో మొత్తం 12కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. అయితే కరోనా బారిన పడిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి వారికి కావాల్సిన మందులను అందుబాటులో ఉం చామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సురేష్ కుమార్ హెల్త్ అసిస్టెంట్ మల్లయ్య, ఫార్మాసిస్ట్ వెంకటేష్ పాల్గొన్నారు.