Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెన్యూవల్ చేయని ప్రభుత్వం
సవితి ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం
- ఆందోళనలో అధ్యాపకులు
- దృష్టి సారించని పాలకులు
బలహీనమవుతున్న ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేస్తున్న అతిథి అధ్యాపకులు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అభద్రతాభావంలో పడ్డారు. కార్పొరేటుకు ధీటుగా విద్యను అందించి ఉత్తమ పలితాలు సాధించేలా తమవంతు పాత్రను పోషించే వీరు తీవ్ర అన్యాయానికి గురౌతున్నారు. విద్యార్థులు లేక వెలవెలబోతున్న కళాశాలల్లో ఇంటింటికి తిరిగి విద్యార్థులను కళాశాలల్లో చేర్పిస్తూ దాదాపు ఏడు దశాబ్ధాలకు పైగా సేవలందిస్తున్నారు. అయినా ప్రభుత్వానికి వీరిపట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. కళాశాలలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు వారు చేయని కృషి లేదు. అయినా వీరిపట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతుంది. సగం వేతనాలిచ్చి పనులు మాత్రం అధికంగా చేయించుకుంటుం ది. ఇదంతా ఓర్చుకుని పనులు చేస్తున్నా వారిని నేటికీ రెన్యూవల్ చేయలేదు. ఒక వైపు అధ్యాపకులకు శిక్షణ ఇస్తూ..మరోవైపు వీరిని పట్టించుకోకపోవడంతో వీరిలో ఆందోళన మొదలైంది. త్రిమెన్ కమిటీ ద్వారా నియామకం చేసుకొని వీరిని మరోసారి పరీక్షించడం సరికాదని అధ్యాపకులు కోరుతున్నారు.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి