నవతెలంగాణ - మహబూబ్‌నగర్ కలెక్టరేట్
అక్రమ ఇసుక రవాణ విషయం లో సస్పెన్షన్‌కు గురైన పంచాయతీ కార్యదర్శు లను విధుల్లోకి తీసుకోవాలని టీఎన్‌జీఓ అధ్యక్ష, కార్యదర్శులు రాజీవ్ రెడ్డి, చంద్రనాయ క్‌లు కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా కలె క్టర్ ఎస్.వెంకట్రావును కలిసి వినతిపత్రం అం దజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ నవాబుపేట, రాజాపూర్ మండలాల్లో అక్ర మ ఇసుక రవాణ విషయంలో పంచాయతి ఇ ద్దరు కార్యదర్శులు, ఇద్దరు వీఆర్‌ఓలు, ఇద్దరు వీఆర్‌ఏఎస్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారన్నారు. ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక సమస్యలు, చేసి న తప్పిదాలను మన్నించి భవిష్యత్‌లో ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా సక్రమంగా వి ధులు నిర్వహించేలా చూస్తామని, అందుకు వె ంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సస్పెన్షన్‌కు గురైన వారందరూ ప్రస్తుత కరోనా సమయంలో కుటుంబ పరిస్థితులు మరింత దిగజారి పోయాయని, విధి లేని స్థితిలో అప్పు లు చేయాల్సిన దుస్థితి నెలకొందని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అదనపు కలెక్టర్ రిపోర్టు తీసుకుని విధుల్లోకి తీసుకుం టామని హామిచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వా రిలో టీఎన్‌జీఓ జిల్లా ట్రెసా జిల్లా అధ్యక్షులు చిన్న కిష్టాన్న, టీజీఓఎస్ జిల్లా ప్రధా న కార్య దర్శి బక్క శ్రీను, టీఎన్‌జీఓఎస్ కోశాధి కారి కష్ణ మోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి విజరు కుమా ర్, క్రీడా కార్యదర్శి శ్యాం సుందర్ రెడ్డి, వీఆర్‌ఓ ల యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నర్సిం హులు, గ్రామ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు బాబన్న, సాయినాథ్, వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బహదూర్ పాల్గొన్నారు.
Authorization