Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు
- కంటైన్మెంట్ జోన్లపై కలెక్టర్ ఆరా
- వైద్యుల నియామక పోస్టులకు ఇంటర్వ్యూలు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ కలెక్టరేట్
జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తు న్న శాసన సభ్యుల క్యాంపు కార్యాలయ నిర్మా ణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశిం చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న భవనాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యు త్తు, టైల్స్, పెయింటింగ్ తదితర పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అంతకుముం దు జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్, ప ద్మావతి కాలనీలోని కంటైన్మెంట్ జోన్లను పరిశీలించి తగు సలహాలు, సూచనలిచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఇం టర్వ్యూలు నిర్వహించి అర్హత, అనుభవ విష యాలపై చర్చించారు. కార్యక్రమంలో జేసీ సీ తారామారావు, డీఆర్‌ఓ కే.స్వర్ణలత, జిల్లా వై ద్యాధికారి కష్ణ, మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొ ఫెసర్ డాక్టర్ కిరణ్ పాల్గొన్నారు.