Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉ పాధి హామీ చట్టం వచ్చిన నాటి నుంచి చట్టం అమలు కోసం విశేష కృషి చేసిన వారిని అకా రణంగా తొలగించడం అన్యాయమన్నారు. అ నేక ఉద్యమాలు, అందోళనలు చేసి రాష్ట్రం సా ధించుకున్న తెలంగాణలో ప్రశ్నిస్తే ఉపాధి లేకు ండా చేయడం బావ్యం కాదన్నారు. గ్రామ కా ర్యదర్శులతో ఈ పనులు చేయించాలని 4779 జీవో తీసుకురావడంతో వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా ఫీల్డు అసిస్టెంట్లు ఆందోళనలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తేలికపాటి పనులైన చెరువుల పూడిక తీత పనులను మిష న్ భగీరథ పేరుతో కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం దారుణమన్నారు. పీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడం వల్ల కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నార న్నారు. పే స్లిప్పులు, జాబ్ కార్డులు ఇవ్వకుండా నేరుగా కూలీ డబ్బులు ఖాతాలో పడతాయని అధికారులు చెప్పడం బాధ్యతారాహిత్యమన్నా రు. క్రమం తప్పకుండా కూలీలకు పనులు, వేతనాలు అందజేయడం, పనిముట్లు వంటివి సకాలంలో రావాలంటే ఫీల్డ్ అసిస్టెంట్లు తప్ప నిసరి అవసరమన్నారు. వెంటనే ఫీల్డ్ అసిసెం ట్లను తీసుకోవాలని కోరారు.