Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇసుక మాఫియా పెట్రేగిపోతోంది. అధికార పార్టీకి చెందిన
నాయకులు, వారి అండదండలుండడంతో ఈ మాఫియా ఆగడాలు
మితిమీరిపోయాయి. కొంతమంది నేతలు మాఫియాగా ఏర్పడి యధేచ్ఛగా
ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దుందుబీనది, కోయిల్‌సాగర్,
కృష్ణతో పాటు ఇతర వాగులు, వంకల నుంచి రూ.కోట్ల విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులను లారీల కింద తొక్కి చంపుతున్నారు. రాజాపూర్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఘటన ఇసుక మాఫియా దుశ్చర్యలకు పరాకాష్టగా నిలుస్తోంది. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖలకు చెందిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే ఇసుక మాఫియా పెట్రేగి పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాను అరికట్టి, భూగర్భ జలాలను కాపాడాలని ఉమ్మడి జిల్లాలోని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి.
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి