నవతెలంగాణ - నాగర్‌కర్నూల్
దసరా నాటికి జిల్లాలో చేపట్టిన రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా అదన పు కలెక్టర్ మనూ చౌదరి అధికారులను ఆదేశి ంచారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మంది రంలో నియోజకవర్గంలోని 41 వ్యవసాయ క్లస్టర్ గ్రామాల సర్పంచులతో రైతు వేదికల నిర్మాణాలపై గురువారం సమీక్షించారు. ఈ స ందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదికల ద్వారా రైతులకు వ్యవసాయంలో నూతన మెళ కువలు, సాకేంతిక పద్ధతులు, రైతుల విజయ గాథలను అందించి రైతుల్లో స్ఫూర్తి నింపాల న్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మా ణాలను అక్టోబర్ 10 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించిందన్నారు. అందులో భాగంగానే ఆ యా వ్యవసాయ క్లస్టర్ గ్రామాలలో సర్పంచు లు, అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల న్నారు. రైతు వేదిక నిర్మాణాల్లో ఎలాంటి అలస త్వం లేకుండా వేగవంతంగా పూర్తయ్యేలా సం బంధిత శాఖల అధికారులు బాధ్యత తీసుకొని ప్రభుత్వం సూచించిన విధంగా 143 రైతు వే దిక నిర్మాణ పనులను చేపట్టాలని సూచించా రు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలో 41 వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాల ను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమా వేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
Authorization