Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రాణం కంటే ప్రాజెక్టులు ఎక్కువ కాదు... | మానవి | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Nov 18,2019

ప్రాణం కంటే ప్రాజెక్టులు ఎక్కువ కాదు...

రాణిగంజ్‌ బాంబే హౌటల్‌ కాంప్లెక్స్‌... చుట్టూరా దుకాణాలన్నీ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ పరికరాలతో నిండి ఉన్నయి. అన్ని షాపు కౌంటర్స్‌లో మగవాళ్లే. కానీ 'సాత్విక ఫైర్‌ సేఫ్టీ' ఒక్కటి మాత్రం ప్రత్యేకం. కారణం... దాని నిర్వహిస్తున్నది ఓ యువతి. సాత్వికా గుప్తా. పురుషాధిపత్యం ఉన్న ఫైర్‌ అండ్‌ సేఫ్టీ రంగంలోకి అడుగిడిన ఫైర్‌బ్రాండ్‌. మన అభివృద్ధి నమూనాలోనే అడుగడుగునా ప్రమాదం ఉంది. అలాగని పనిచేయకుండా, బయట అడుగుపెట్టకుండా ఉండలేం. అందుకే భద్రతా పరికరాలు, ప్రమాణాలు ఉన్నవి. వాటిని ధరించడంలో అలసత్వం, పాటించడంలో అశ్రద్ధ ఎన్నో అనర్ధాలకు దారితీస్తోంది. ఈ సోయి వ్యక్తులకే కాదు... సంస్థలకు లేదన్నదే సాత్విక ఆందోళన. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివింది. అయినా ఫైర్‌సేఫ్టీ మీద ఉన్న ఆసక్తితో తండ్రి వ్యాపారంలోకి అడుగుపెట్టింది. లండన్‌వెళ్లి అన్నిరకాల భద్రతపై లోతైన అధ్యయనం చేసింది. మంచి మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ స్వరాష్ట్రం కోసమే పనిచేయాలని తిరిగొచ్చింది. 'సేఫ్టీ తెలంగాణ నా లక్ష్యం' అంటున్న ఆమె పరిచయం...
మంటలను చూస్తేనే ఆమడ దూరం పరుగెడతారు. అలాంటిది సేఫ్టీ రంగంలోకి రావడానికి ఆసక్తి ఎలా పుట్టింది?
మాది హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి. నాన్న గుమడెల్లి వినోద్‌కుమార్‌. అమ్మ వాణి. పెండ్లికి ముందు నాన్న బాంబేలో 'జెనిత్‌ ఫారిన్‌ సేఫ్టీ' సంస్థలో మార్కెటింగ్‌, ఎక్సిటింగిషర్స్‌ రీఫిల్లింగ్‌ వర్క్‌ చేసేవారు. పెండ్లయిన తరువాత హైదరాబాద్‌ వచ్చారు. నేను పుట్టిన ఏడాదే నా పేరు మీద 'సాత్విక అగ్ని ప్రమాద నివారణ పరికరాల సరఫరా సంస్థ'ను స్థాపించారు. అప్పట్లో ముంబయి, ఢిల్లీలో మాత్రమే అవి ఉండేవి. తొలిసారి దక్షిణాదికి నాన్న పరిచయం చేశారు. మా కంపెనీలో అన్ని బాధ్యతలు నాన్నే చూసుకునేవారు. నాన్న పనిమీద బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు తనతోపాటు వెళ్లేదాన్ని. చిన్నతనంలో అర్థమయ్యేది కాదుగానీ... నాన్నతో బయటికెళ్తున్నానన్న సంతోషం ఒక్కటి ఉండేది. పదేండ్లు వచ్చేనాటికి నాన్న ఆఫీస్‌లో కూర్చుని ఫైలింగ్స్‌ చేసేదాన్ని. అప్పటినుంచే 'నీకు ఇష్టమున్న పని చెయ్యి' అనిప్రోత్సహించేవారు నాన్న. చదువుల్లో ముందుండేదాన్ని. దాంతో క్లాసులు జంప్‌ చేస్తూ... 16 ఏండ్లకే హౌలీమేరీ బిజినెస్‌ స్కూల్లో డిగ్రీ బీబీఏ పూర్తి చేసిన. అప్పుడే నాకు నాన్న బిజినెస్‌ మాత్రమే కాకుండా అన్ని వ్యాపారాల గురించి తెలిసొచ్చింది. కానీ నాన్న బిజినెస్‌లోనే ఉంటే ఇతరుల ప్రాణాలతోపాటు ఆస్తులు కాపాడిన వ్యక్తినవుతాననిపించింది. అందుకే మా సంస్థలోనే పనిచేయడం మొదలుపెట్టాను. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివిన వ్యక్తిగా... మా సంస్థలాంటి సంస్థలు ఇంకా ఏమేం సర్వీస్‌లు అందిస్తున్నాయని ఎనాలసిస్‌ చేసి... అలారమ్‌ సిస్టమ్‌, ఫైర్‌ హైడ్రాంట్‌ వంటివన్నీ యాడ్‌ చేశాం. మా సంస్థలో ఓ ట్రైనర్‌ ఉండేవారు. అగ్ని ప్రమాద నివారణ యంత్రాలు అమర్చడంతోపాటు, వాటిని ఎలా వాడాలి? ప్రమాదం వచ్చినప్పుడు దానినుంచి ఎలా తప్పించుకోవాలని ట్రైనింగ్‌ ఇచ్చేవారు. అతనితోపాటు కంపెనీలకు నేనూ వెళ్లి వినేదాన్ని. సేఫ్టీ ట్రైనింగ్స్‌ నాకు బాగా అర్థమయ్యేవి. దాంతో నేర్చుకుని మా కంపెనీ క్లయింట్స్‌కే కొన్ని వందల ట్రైనింగ్స్‌ ఇచ్చాను. చిన్నపిల్లను చెబుతున్నాను కదాని ఆసక్తిగా వినేవారు.
కెరీర్‌గా ఎంచుకోవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?
నా ఆసక్తిని చూసి మా నాన్న 'బీఈ ఫైర్‌ అని ఉంటుందట. అది చదువు' అని సలహా ఇచ్చారు. దానికోసం పెద్ద యూనివర్సిటీ నుంచి చేయాలని ఆన్‌లైన్‌లో చాలా పరిశోధించాను. ముంబైలో చిన్న చిన్న కాలేజీల్లో ఉన్నాయి. అన్నామలై యూనివర్సిటీలో ఉంది. కానీ అది డిస్టెన్స్‌. ఫైర్‌ సేఫ్టీ లైవ్‌గా నేర్చుకోవాలనిపించింది. బీబీఏ అయిపోగానే... వేసవి సెలవుల్లో... మెహదీపట్నంలోని ఫైర్‌ సేఫ్టీ ఇనిస్టిట్యూషన్‌లో మూడు లెవల్స్‌ వరకు చదువుకున్నా. ప్రతి బహుళ అంతస్తుల భవనంలోనూ అగ్ని ప్రమాదం జరగకుండా తగిన ఏర్పాట్లు, ఒక వేళ జరిగితే దాని నుంచి తప్పించుకునేందుకు మార్గం, నిప్పుని తక్షణం నిలువ రించే పరికరాలు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. అంతేకాకుండా అక్కడ పనిచేసే సిబ్బంది లో కొందరికెనా తమతో పాటు తోటి వారి రక్షిం చేందుకు తగిన సామర్థ్యం, యుక్తులు అందించే శిక్షణ అవసరమని కూడా ఈ నిబంధన సూచిస్తుంది. ఆ చట్ట ప్రకారం నిబంధనలు పాటించే సంస్థలకు పరికరాలూ, శిక్షణ అందించడమే మా పని. అగ్ని ప్రమాద ఆనం తరం పోలీసులకు ఫిర్యాదు దగ్గర్నుండి, ప్రమాద, ప్రాణ నష్టాలను అంచనా వేయడానికి మా కన్సల్టెన్సీ ఉపయోడపడుతుంది. కాలేజీలు, కార్పొరేట్‌ సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, ప్రభుత్వ భవనాలు... ఇలా అనేక ప్రముఖ సంస్థల భవనాలకు అగ్ని ప్రమాద దక్షలు బాధ్యత నిర్వర్తిస్తూనే ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుకోకుండా జరిగితే తక్షణం స్పందించాల్సిన తీరు, ప్రమాదాన్ని ముందే ససిగట్టే యంత్రం, అదుపు చేసే పరికరాల వినియోగం తదితర అంశాల్లో శిక్షణ అందించాను.
లండన్‌ వెళ్లి చదవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అక్కడి ప్రత్యేకతలు ఏంటి?
మెహదీపట్నంలో చదువుకోవడానికంటే ముందే... ఆన్‌లైన్‌లో చూసినప్పుడు సేఫ్టీ ఓ సముద్రమని అర్థమయ్యింది. అందులో ఫైర్‌ సేఫ్టీ ఒక పోర్షన్‌ మాత్రమే. సేఫ్టీ మొత్తం చదివితే... మనం ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. ఆ మొత్తం సేఫ్టీ విజ్ఞానాన్ని అందించే యూనివర్సిటీలు యూఎస్‌లో, యూకేలో ఉన్నాయి. యూఎస్‌ది కేవలం యూఎస్‌కే పరిమితం. అదే యూకేలో చదువుకుంటే ప్రపంచమంతా దాన్నే అనుసరిస్తారు. అందుకే లండన్‌కు వెళ్లి చదువుతా అంటే నాన్న ఓకే అన్నారు. కానీ... టెన్‌ప్లస్‌ ఫోర్‌ కచ్చితంగా చదివి ఉండాలని చెప్పారు. దానికితోడు నా వయసు కూడా అందుకు సరిపోను లేదు. అందుకే ఎంబీఏ చేశాను. ఆ తరువాత లండన్‌లోని మిడిల్‌ సిక్స్‌ యూనివర్సిటీకి అప్లై చేస్తే... చదువుకోవడానికి అవకాశమే కాదు స్కాలర్‌షిప్‌ కూడా వచ్చింది. అట్టా... 2016లో లండన్‌ వెళ్లి సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో టాప్‌మోస్ట్‌ కోర్స్‌ చదివాను. 9పాయింట్స్‌తో కాలేజీ టాపర్‌గా పూర్తి చేశాను. సేఫ్టీ అంటే మనకు కనిపించేది ఫైర్‌ మాత్రమే. కానీ న్యూక్లియర్‌, రేడియేషన్‌, కెమికల్‌, వాటర్‌ కెమికల్‌, కుకింగ్‌, ఫుడ్‌, కన్‌స్ట్రక్షన్‌, రోడ్‌సేఫ్టీ, ఉమెన్‌సేఫ్టీ ఇలా ఎన్నో రకాలున్నాయి. కోర్సు పూర్తయ్యాక బ్రిటీష్‌ సేఫ్టీ కౌన్సిల్‌లో హెల్త్‌ అండ్‌ సేఫ్టీ చేశాను. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఫైర్‌ అండ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ చేశాను. లండన్‌లో ఉన్నది రెండేండ్లే. కానీ ఏడాదిలోనే అన్ని కోర్సులు కంప్లీట్‌ చేశాను. లండన్‌లోనే 60 ట్రైనింగ్స్‌ ఇచ్చాను. ఎన్‌హెచ్‌ఎస్‌లో సేఫ్టీ ఆఫీసర్‌గా పనిచేశాను. పర్మినెంట్‌ అయ్యే అవకాశం ఉండె. కానీ మన దగ్గరే పనిచేయాలని తిరిగి వచ్చాను. లండన్‌ నుంచి ఫిబ్రవరిలోనే వచ్చిన. అప్పటినుంచి ఇప్పటివరకు కొన్ని వందల ట్రైనింగ్స్‌ ఉచితంగా ఇచ్చాను.
అంతమంచి అవకాశాన్ని వదులుకుని వచ్చారు. మన దగ్గర సేఫ్టీ ఎలా ఉంది?
మన దగ్గర సేఫ్టీ గాలిలో దీపం. వ్యక్తులు... సంస్థలూ ఎవ్వరూ సరైన పద్ధతులు పాటించడం లేదు. లండన్‌ రూల్స్‌ ప్రకారం ఏదైనా కంపెనీలో ప్రమాదం సంభవించి ప్రాణనష్టం జరిగితే.. ఆ కంపెనీకి ఆదాయం ఎంత ఉంటుందో ఆ స్థాయిలో మనం సూ చేయచ్చు. మనిషివయసు, వాళ్ల ప్రతిభను బట్టి పరిహారం ఉంటుంది. కానీ మన దగ్గర వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడుతుంటారు. వాటి వల్ల ప్రాణనష్టం జరిగితే రెండు మూడు లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. ప్రాణం కంటే ప్రాజెక్టులు ఎక్కువ కాదు. ప్రాజెక్టులనే కాదు... ప్రతి చోటా అదే పరిస్థితి. ఏదైనా ప్రమాదం జరిగిన తరువాత దాని అరికట్టడానికి ప్రభుత్వం నుంచి ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ప్రయత్నాలుంటున్నాయి కానీ.. నివారణ పద్ధతులను సరిగ్గా పాటించడం లేదు. దానిమీద సరైెన పర్యవేక్షణ లేదు. దీనిని ప్రశ్నించడానికి వ్యక్తులకు సరైన అవగాహన లేదు. పాటించాలన్న నిజాయితీ అన్ని సంస్థలకు ఉండటం లేదు. కొన్ని చోట్ల ఉన్నా... ట్రైనింగ్‌ ఇచ్చేవాళ్లు కూడా సరిగ్గా లేరు. ఎలాంటి సర్టిఫికెట్స్‌, సరైన అవగాహన లేకుండా భద్రతా శిక్షణ ఇస్తున్నారు. ప్రాథమిక సూత్రాలే తెలియదు. ఈ పరిస్థితిలోమార్పు రావాలి. తెలంగాణలోని అన్ని జిల్లాలో ఈ ట్రైనింగ్‌ ఇవ్వాలనుకుంటున్న. స్కూల్‌ కరిక్యులమ్‌లోనే సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ పాఠం ఉండాలి. దీనివల్ల చిన్నతనం నుంచే నేర్చుకుంటారు. అలాగే ప్రతి వ్యక్తి... వ్యక్తిగత భద్రతను బాధ్యతగా పాటించాలి. తను పనిచేసే సంస్థల నుంచి భద్రత హక్కుగా అడిగి తీసుకోవాలి. అలాగే సంస్థలు బాధ్యతగా అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటించాలి. నా దగ్గర కేవలం ఫైర్‌ సేఫ్టీనే కాదు... అన్ని సేఫ్టీ రిలేటెడ్‌ ప్రాడక్ట్స్‌ ఉంటాయి. అవి కొనడానికి వచ్చినవాళ్లకు కావాలంటే ట్రైనింగ్స్‌ ఇస్తున్నాను. 'సేఫ్టీ తెలంగాణ' నా లక్ష్యం. అందుకోసం నాకు సాధ్యమైనంత నేను పనిచేయాలనుకుంటున్నా.
అమ్మానాన్న ప్రోత్సాహంతోనే...
మా ఇండ్లలో అమ్మాయి అనగానే ఎంత తొందరగా పెండ్లి చేసి పంపిచేద్దామా అని చూస్తారు. కానీ మా నాన్న నా ఆసక్తిని చూసి ప్రోత్సహించారు. నాన్నను, అమ్మను ఒప్పించి బిజినెస్‌లోకి వచ్చాను. మా నాన్నగారు కూడా నాకు అంతే సపోర్ట్‌ చేశారు. మహిళలు అసలే లేని రంగంలో నేను నిలదొక్కుకోగలిగానంటే అది వాళ్ల ప్రోత్సాహమే. కేవలం ఫైర్‌ సర్వీసెస్‌కే పరిమితం కాలేదు. అదీరా ఎన్జీవో ఏర్పాటు చేసి... పిల్లలను చదివిస్తున్నాను. మా ఇంటి దగ్గర బస్తీలో చదువుకోలేని పిల్లలకు విద్య, వైద్యం, ఫుడ్‌ నేనే చూసుకుంటున్నా. వాళ్లను ఇంటర్‌, డిగ్రీ వరకు చదివించినా చాలు. ఉద్యోగం చేసుకోగలుగుతారు. వాళ్లు మరో పది మందికి సాయపడతారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాఠ్యాంశంగా చేర్చాలి...
మనసారా నవ్వుదాం!
క్యాన్సర్‌ బాధితుల కోసం
ప్రసవానంతరం..
శశాంకాసనం
సంఖ్యనే తప్ప.. సమస్య కాదు..
ఒత్తిడిని దూరం చేసే చామంతి టీ
ఇట్లా చేద్దాం
అందాన్ని పెంచే అరటి
సానుకూల ఆలోచనే ముఖ్యం...
రంగ వల్లులు
ఆరోగ్యానికే కాదు అలంకరణకు కూడా..!
అర్థం చేసుకుంటే సమస్యలేదు
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే
నడుముపై చేతివేస్తే..!
రాగులతో మేలైన ఆరోగ్యం
రోజంతా ఉత్సాహంగా...
మహిళలను చైతన్య పరచాలి
ఐరన్‌ ఎక్కువుండాలి...
మెహందీ తొలగించాలంటే
చుండ్రును తగ్గించే సహజ చిట్కాలు
కాన్ఫిడెన్స్‌ పెరగాలా?
రంగ వల్లులు
కొలెస్ట్రాల్‌కు చెక్‌
సమానత్వానికి ఇంకెన్నాళ్లు..!
సౌందర్యానికి కమలాలు
మెరిపించే నెయిల్‌ఆర్ట్‌
ఎప్పటికప్పుడు శుభ్రంగా
కెరటాలతో పోటీపడుతూ..
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తాజా వార్తలు

09:54 PM

భారత్‌పై వెస్టీండీస్‌ గెలుపు

09:43 PM

ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది: నారా లోకేష్

09:32 PM

వరంగల్‌లో 200 కిలోల గంజాయి సీజ్

09:17 PM

రెండో వికెట్ కోల్పోయిన వెస్టీండీస్‌

08:55 PM

ఎంబీబీఎస్‌ సీట్ల పేరుతో ఘరానా మోసం

08:48 PM

రూ.100 కోట్లు దాటిన శబరిమల ఆదాయం

08:34 PM

కేఏ పాల్ ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

08:33 PM

హెట్మెయిర్ సెంచరీ

08:31 PM

ఫిలిప్పీన్స్ భూకంపం ఘటనలో ముగ్గురు దుర్మరణం

08:29 PM

హోప్ హాఫ్ సెంచరీ

08:23 PM

మ్యాచ్‌ మధ్యలో స్టేడియంలోకి కుక్క...

08:12 PM

పర్యాటక కేంద్రంగా రామప్ప చెరువు : పార్ధసారధి

08:06 PM

రైతుని కోటీశ్వరుడిని చేసిన ఉల్లి

07:43 PM

హెట్మెయిర్‌ అర్ధ శతకం

07:41 PM

మినీలారీ బైక్‌ ఢీకొని : ముగ్గురు మృతి

07:29 PM

రేపు ఉన్నావ్‌ తీర్పు వెల్లడించనున్న ఢిల్లీ హైకోర్టు

07:23 PM

పెంచిన విజయ పాల ధరలను ఉపసంహరించుకోవాలి

07:20 PM

బాలీవుడ్‌ నటి అరెస్ట్‌

07:14 PM

ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలి: పసుపు రైతులు

07:04 PM

తిరుమలలో కొనసాగుతన్న రద్దు...

06:51 PM

హీరో బషీద్ అరెస్ట్

06:48 PM

రోడ్డుప్రమాదంలో హోం గార్డు మృతి

06:38 PM

తొలి వికెట్ కోల్పోయిన విండీస్

06:32 PM

కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు

06:28 PM

ఢిల్లీలో బస్‌లు దగ్ధం

06:19 PM

మిల్లర్లు ధాన్యం​ కొనుగోలు చేసేలా చర్యలు: కన్నబాబు

06:15 PM

కనీస గౌరవం ఇవ్వటంలేదు: గౌతు శిరీష

05:49 PM

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

05:44 PM

విండీస్ టార్గెట్-289

05:33 PM

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.