Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఖాళీ సమయంలో కళలు నేర్చుకుందాం | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

ఖాళీ సమయంలో కళలు నేర్చుకుందాం

కోవిడ్‌ 19 వైరస్‌కు వ్యాక్సిన్లు వస్తున్నాయని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. జనవరి 16వ తేదీ నుంచి మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి కోవిషీల్డు, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు రెండూ దేశంలో తయారౌతున్నవి కాబట్టి ఎంతో సంతోషం. పైగా ప్రపంచ దేశాలలో తయారవుతున్న వ్యాక్సిన్ల కంటే తక్కువ రేటుకే లభించడం కూడా సంతోషదాయకం. సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డు వ్యాక్సిన్లు 1.1 కోట్ల డోసులు, భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు 55 లక్షల డోసులు రెడీగా ఉన్నాయని చెబుతున్నారు. ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి మొదటగా ఈ వ్యాక్సిన్‌ను అందజేస్తున్నారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో 50 ఏండ్లు పైబడిన వారికి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న 50 ఏండ్లు లోపల వయసున్న వారికీ ఇస్తారు. ప్రజలంతా సంతోషించాల్సిన సమయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కాటువేసిన వారి సంఖ్య తొమ్మిది కోట్లు దాటింది. పూర్తి సంరక్షణ జరిగే దాకా ఇంట్లోనే ఉండి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం...

గురువింద గింజలతో...
'తన కింద ఉన్న నలుగు తనెరగదు' అంటూ ఎవరైనా తమ తప్పులు దాచిపెట్టుకుని ఎదుటి వారిని విమర్శించేటపుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. అలా గురివిందగింజలు మానవ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన గింజలు. ఆ గింజలు అలాగే బత్తాయి గింజలతో నేనో చెట్టు కొమ్మను తయారుచేశాను. ఇంకా టాబ్లెట్లు వేసుకున్నాక పారవేసే అల్యూమినియం తుక్కును కూడా ఉపయోగించాను. ఈ టాబ్లెట్‌ స్ట్రిప్పులను సన్నగా కత్తిరించి చెట్ల కొమ్మలకు ఉపయోగించాను. ఇంకా ఆకులు కూడా దీనితోనే తయారుచేశాను. ఇప్పుడు గురివింద గింజలతో పువ్వును తయారు చేశాను. అలాగే బత్తాయి గింజలతోనూ పువ్వును చేశాను. ఇవి ఎర్రటి పువ్వు, తెల్లటి పువ్వులా రెండు రంగుల్లో ఉన్నాయి. ఆకులు, పువ్వులు, కొమ్మలతో చెట్టు కొమ్మ తయారైంది.ప
కోడి పందేల పూలతో...
పెద్ద చెట్టుంటుంది. దానికి ఎర్రని పూలు పూస్తాయి. ఆ పూలకు ఎర్రటి కేసరాలు పచ్చని పుప్పొడితో ఉంటాయి. ఈ పుప్పొడి ఈ పూలలో కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది. అందుకని ఈ పూలతో కోడి పందేల ఆట ఆడతారు పిల్లలు. నేనూ చిన్నతనంలో ఆడుకున్నాను. కేసరాలను ఇద్దరు పిల్లలు మెలివేసి లాగితే ఎవరి పుప్పొడి రాలిపోతే వారు ఓడిపోయినట్టు. ఈ పూవు పూర్తిగా ఎండిపోయి రాలిపోయింది మా ఇంట్లో. పువ్వు కేసరాలు బయటకు వచ్చి, పువ్వు ముడుచుకుపోయి ఉండటంతో పురుగు ఆకారంలో కనిపించింది. వెంటనే దాన్ని తీసి దాచాను. కేసరాలు కాళ్ళలా పుప్పొడి వేళ్ళలా చాలా గమ్మత్తుగా ఉంది. మీరే చూడండి.
వెల్వెట్‌ షీట్లతో
షాపుల్లో ఎరుపు, నలుపు, నీలం, వంగరంగు అంటూ రంగుల్లో వెల్వెట్‌ షీట్లు దొరుకుతాయి. వాటిని తెచ్చుకుంటే బొమ్మలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అలా ఓ ఎరుపురంగు వెల్వెట్‌ షీటుతో ఒకసారి మా మిత్రురాలి కోసం మెమెంటో చేశాను. ఈ షీట్ల బదులుగా వెల్వెట్‌ క్లాత్‌ కూడా వాడవచ్చు. అయితే అవి కొద్దిగా ఖరీదు ఎక్కువగా ఉంటుంది. మా మిత్రురాలు తన కవిత్వ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటూ రమ్మని పిలిచింది. అందుకోసం ఇది తయారు చేశాను. ముందుగా డ్రాయింగ్‌ షీటును హృదయాకారంలో కత్తిరించుకున్నాను. ప్రేమగా ఇస్తున్నానని చెప్పడానికి ఈ ఆకారంలో కత్తిరించాను. దానిపై విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ రేఖా చిత్రాన్ని వేశాను. అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఠాగూర్‌ బొమ్మను వేశాను. రెండు మాటలు తన కోసంరాసి హృదయాకారాన్ని అలంకరించాను. టాబ్లెట్‌ స్ట్రిప్పులను కత్తిరించి ఆకుల్లా అతికించాను. ఇంజక్షన్‌ సీసాల మీద ఉండే తళుకులను పువ్వుల ఆకారకంలో అతికించాలి. పువ్వులు, ఆకులతో చక్కని లత ఏర్పడింది. మొత్తం తయారయ్యాక చక్కగా ఫ్రేమ్‌ చేయించి బహుమతిగా ఇస్తే తను చాలా సంతోషించింది. మీరూ ఇలా స్నేహితుల కోసం సొంతంగా తయారు చేయండి.
కరోనా ముగ్గు
ఈమధ్యనే ధనుర్మాసం పూర్తయింది. సంక్రాంతికి ఈ నెల రోజులూ ముగ్గులు వేశాం కదా! నేను కరోనా ముగ్గులు తయారు చేశాను. కరోనా వైరస్‌ల ముగ్గులు వేశాను. అంతకు ముందు వైద్యానికి సంబంధించిన మెడికల్‌ ముగ్గుల్ని సృష్టించాను. అలాగే ఈసారి కూడా కరోనా వైరస్‌ గురించి అవగాహన కల్పించేందుకు ముగ్గులు తయారు చేశాను. వాటిలో ఈ రోజొక ముగ్గును పరిచయం చేస్తాను. ఇందులో కరోనా వైరస్‌లను చిత్రించాను. 15 చుక్కలు 8 చుక్కలు వచ్చేదాకా మధ్య చుక్క పెట్టి ఈ ముగ్గును తయారు చేశాను. వీటి చుట్టూ వచ్చే డిజైన్‌లో కరోనా వైరస్‌ను కాలితో తొక్కుతున్న మనిషి బొమ్మను చిత్రించాను. ఎప్పటికైనా వైరస్‌పై విజయం మనిషి సాధిస్తాడని చెప్పటానికే ఈ ముగ్గును వేశాను. ఏ సామాజిక సమస్యలైనా మొదటగా మహిళల్ని చేరితేనే వాటికి పరిష్కారం లభిస్తుంది. ఇల్లాలికి అన్ని విసయాలూ తెలిస్తే ఇల్లు బాగుపడుతుంది. అందుకే ఏ సమస్య అయినా మొదటగా మహిళల్ని జాగరూకతలు పాటించేలా చెయ్యాలి. వారికి అవగాహన కల్పిస్తే దానిని పారద్రోలే పనిలో ముందుంటారు. నేను ప్రతి సమస్యనూ మహిళలకు ఇష్టమైన ముగ్గుల ద్వారానే తెలియపరచటానికి ప్రయత్నిస్తాను.
అట్టముక్కలతో...
మా హాస్పిటల్‌లో మందులు తెచ్చే అట్టపెట్టెలన్నీ ఒక పక్కగా పెడతాము. అలా పెట్టిన వాటిలో శుభ్రంగా, నలగకుండా ఉన్న వాటితో బొమ్మలు చేస్తుంటాను నేను. మాది చిన్నపిల్లల హాస్పిల్‌ అని తెలుసు కదా! మరి పిల్లల కోసం బుల్లి బుల్లి కుర్చీలు కావాలి కదా! వారి కోసం నాలుగు బుల్లి కుర్చీలు ఒక బుల్లి డైనింగ్‌ టేబుల్‌ సిద్ధం చేశాను. మరి దీని కొరకు కట్టెలనుక సిద్ధం చేసుకోవాలి కదా! టేకు, వేప, తుమ్మ చెక్కలు వాడదామా! మనకవేమీ అక్కర్లేదు. అట్టముక్కలుంటే చాలు. నలుచదరపు ముక్కలు నాలుగు కత్తిరించాను. వాటికి సన్నగా కత్తిరించిన అట్ట ముక్కల్ని కాళ్ళుగా అమర్చాను. ఇవి అతికించడానికి గ్లూగన్‌ కావాలి. మామూలు ఫెవికాల్‌తో కష్టం. మరో నాలుగు నలుచదరపు ముక్కల్ని మధ్యలో డిజైన్‌గా కత్తిరించి వెనక వైపు ఆనుకునేలా ఉండే విధంగా కుర్చీకి అతికించాను. ఇప్పుడు కుర్చీ ఆకారం వచ్చేసింది. ఇప్పుడు ఒక గుండ్రటి ముక్కను కత్తిరించి నాలుగు కాళ్ళు పెట్టాను. బుల్లి డైనింగ్‌ టేబుల్‌ తయారయ్యింది. బాగున్నాయి కదూ!

- డా|| కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు
ఇంటి నుండే పనిచేస్తున్నారా?
పాత వస్తువులతో పసందుగా
ఆరోగ్యం మీ సొంతం కావాలంటే..?
రాగులతో రుచికరంగా...
ఓ కప్పు చాలు
మీ చర్మతత్వాన్ని బట్టి...
స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి
కండ్లు చెదరగొట్టే కాటన్‌
పాలిచ్చే తల్లుల కోసం...
గుడ్డుతో మెరిసిపోండి
పోషకాలు ఎక్కువ
ఒత్తిడిని ఇలా జయించండి
చర్మం మెరిసిపోతుంది
ఇంటి చిట్కాలు చాలు
హామీ పత్రం

తాజా వార్తలు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

05:21 PM

ఎంపీ అరవింద్ సభలో కుర్రాడి రియాక్షన్స్.. వీడియో వైరల్

05:09 PM

నగరంలో 16కేజీల గంజాయి స్వాధీనం

05:02 PM

మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం: కేవీపీఎస్

05:01 PM

హత్యాయత్నం చేశారని పోలీసులను ఆశ్రయించిన నటి శ్రీసుధ

04:50 PM

స్టీల్ ప్లాంట్ పై జగన్ పోరాడే పరిస్థితి లేదు : నారా లోకేశ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.