Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాధపడినప్పుడు ఓదార్చేవారు, ఆనందలో పాలు పంచుకునేవారు మన స్నేహితురు. అటువంటి స్నేహితుల మధ్య అనుకోకుండా కొన్ని చిన్న చిన్న మనస్పర్థాలు వస్తుంటాయి. స్కూల్లో, కాలేజీల్లో, పని ప్రదేశాల్లో మనకు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురయ్యే ఉంటాయి. అయితే ఇవి కేవలం స్నేహితుల మధ్యే కాదు బంధువుల మధ్య కూడా వస్తుంటాయి. మనం పెద్దయ్యాక ఇతరులతో స్నేహం చేసే విధానం చాలా వరకు వృత్తి పరంగానే ఉంటుంది. అందువల్ల ఈ బిజీ జీవితంలో చిన్నతనంలో దూరమైన స్నేహాలను, సంబంధాల తిరిగి కలుపుకోవడం గురించి ఎక్కువగా ఆలోచించం. కొంతమంది తమ స్నేహితులతో తిరిగి మాట్లాడాలి అనుకున్నా.. వాళ్లు ఎలా స్వీకరిస్తారో తెలియక ఆ వైపు అడుగులు వేయరు. అందువల్ల, మనస్పర్థలు పక్కన పెట్టి మీ స్నేహ బంధాన్ని తిరిగి చక్కదిద్దుకోవడానికి ఈ మార్గాలను అనుసరించండి.
సమస్యలను గుర్తించండి : విడిపోయిన మీ స్నేహబంధాన్ని చక్కదిద్దడానికి మీరే ముందడుగు వేయండి. మొదట మీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలను గుర్తించండి. మీ మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను, దాని పరిష్కారాలను అన్వేషించుకోండి. ఒకవేళ మీవైపే తప్పుంటే దాన్ని అంగీకరించండి. మీ స్నేహితుల తప్పుంటే వారిని క్షమించండి.
నమ్మకంగా ఉండండి : ఏ సంబంధామైనా నమ్మకంతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి, మీ స్నేహితులతో నమ్మకంగా ఉండండి. ఒకవేళ మీ మధ్య మనస్పర్థలు వస్తే వాటిని చక్కదిద్దడానికి మీరే మొదటి అడుగు వేయండి. మనస్పర్థలు పక్కన పెట్టి మీ స్నేహితులకి కాల్ చేయండి లేదా ఏదైనా పార్టీకి పిలిచి మాట్లాడండి. తద్వారా మీ మధ్య మనస్పర్థలు సమసిపోతాయి.
నింద మోపొద్దు : మీరిద్దరూ సమస్య పరిష్కరించుకోవడానికి కూర్చున్నప్పుడు, మళ్ళీ పాత తప్పులను గుర్తు చేస్తూ మీ స్నేహితులపై నిందలు మోపకండి. ఎందుకంటే మీ స్నేహితులని నిందించడం అనేది మీ బంధం బలపడటానికి సహాయపడదు. కాబట్టి.. మీ సమస్యను పరిష్కరించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టండి.
క్షమాపణలు చెప్పండి : మీ పాత స్నేహితులతో తిరిగి మాట్లాడటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. ఒకవేళ మీ స్నేహితులు మీ సంజాయిషీకి అంగీకరించక పోయినా, ఎల్లప్పుడూ ముందుకు సాగడం నేర్చుకోండి. క్షమాపణను అంగీకరించడానికి, మీరు క్షమాపణలు అడగటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.
టూర్‌కు వెళ్ళండి : అన్నీ మీరు అనుకున్నట్టే జరిగి మీరిద్దరూ తిరిగి కలిస్తే మీ బెస్ట్ ఫ్రెండ్‌తో ఇది వరకు మీరు వెళ్లాలని అనుకున్న ట్రిప్పుుకు ప్లాన్ చేయండి. ఇది మీ ఇద్దరి మధ్య స్నేహబంధం బలపడటానికి మంచి జ్ఞాపకాలను పునరుద్ధరించడానికి ఎంతగానో సహాయపడుతుంది.