Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపావళి వచ్చేసింది. ఇల్లు శుభ్రం చేసుకునే బిజీలో ఉంటారు అందరూ. అలాగే అలంకరించు కోవడం, సువాసనలు వెదజల్లడానికి ఏవేవో వాడు తుంటాం. అయితే ప్రతీదీ షాపుల్లో కొనుక్కోకూడదు. రూమ్ ఫ్రెష్‌నర్ లాంటివి ఇంట్లోనే చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు. ముఖ్యంగా పండుగ సీజన్‌లో ఇంటికి చుట్టాలు, చుట్టు పక్కల వారు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ల కోసమనే కాదు... ఇంట్లో ఉండే మనం కూడా రకరకాల వాసనలు ఇంట్లో వస్తూ ఉంటే భరించలేం. పరిమణాల కోసం కృత్రిమ సెంట్లు, స్ప్రేలను వాడితే లేనిపోని ఆనారోగ్యాలు తప్పవు. పైకా అవి ఎంతో ఖరీదుతో కూడుకొని వుంటాయి. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడమెందుకు మీరే స్వయంగా రూమ్ ఫ్రెష్‌నర్ తయారుచేసుకోండి. అందుకు కావాల్సినవన్నీ ఇంట్లోనే రెడీగా ఉంటాయి. వాటి పరిమళాల ముందు బ్రాండెడ్ రూమ్‌ఫ్రెష్‌నర్లు కూడా దిగదుడుపే. ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.
ఎ పులావులో వేస్తారే ఆ బే ఆకులు కొన్ని తీసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క, నిమ్మ తొనలు తీసుకోండి. ఇవన్నీ ఓ గిన్నెలో వేసి గదిలో ఓ మూల ఉంచండి. ఓ నాలుగైదు గంటలపాటూ మీకు స్వీట్ టేస్ట్ వాసన వస్తూ ఉంటుంది. నిమ్మ తొనలు లేకపోతే, కమలాపండు తొక్కలు, తొనల వంటివి కూడా అదే ఫ్రెష్‌నర్ ఇస్తాయి.
ఎ కిచెన్‌లో రకరకాల వాసనలకు చెక్ పెట్టేందుకు ఓ గిన్నెలో కొంత నీరు పోసి ఓ చిన్న దాల్చిన చెక్క, యాలకులు, బే ఆకులు వేసి ఉడకబెట్టండి. అవి ఉడుకుతున్నప్పుడు స్టవ్ మంటను సిమ్‌లో పెట్టండి. ఇలా కాసేపు చేస్తే కిచెన్ మొత్తం సుగంధ ద్రవ్యాల పరిమళాలతో నిండిపోతుంది. ఇక ఎంతసేపైనా అక్కడే ఉండాలనిపిస్తుంది.
ఎ ఓ చిన్న కార్డ్ బోర్డ్ బాక్సులో కొద్దిగా తినేసోడా, కొన్ని చుక్కల నూనె వెయ్యండి. బాక్సు పైన ఓ చిన్న కన్నం ఉండాలి. కన్నం లేకపోతే మీరే కన్నం పెట్టండి. దీన్ని మీరు బాత్ రూం లేదా రూంలోని ఓ మూల ఉంచారంటే కుళ్లు వాసనలు, చెడు వాసనలు, కంపు వంటివి అన్నీ పోతాయి. చేయాల్సిందల్లా కొన్ని రోజులకు ఓసారి కొన్ని నూనె చుక్కలు పొయ్యడమే.