Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సారీ... నాన్నా ... | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Feb 13,2021

సారీ... నాన్నా ...

రామచంద్రం రిటైర్డ్‌ టీచర్‌. ఇంటి బయట కుర్చీలో కూర్చొని టీ తాగుతూ పేపర్‌ చదువుతున్నాడు. అప్పుడే సెల్‌ ఫోన్‌ మోగింది. అద్దాలు సవరించుకుని చూసాడు. కొడుకు కిరణ్‌ నుంచి కాల్‌.
పోన్‌ తీసి 'ఆ చెప్పురా... అంత బాగేనా' అన్నాడు వణుకుతున్న స్వరంతో.
కిరణ్‌ బాధగా ఏదీ చెప్పకుండా ''నాన్న... నువ్‌ అర్జంట్‌ గా రావాలె ''అన్నాడు.
ఆ మాటలకు తండ్రి కంగారుగా ''ఎందుకురా... ఏమైంది'' అడిగాడు.
ఎప్పుడు వున్నదే అన్నటుగా ''ఏ.. మీరు రండి. వచ్చినంక చెప్పుత. వీలైతే ఇప్పుడే బయలు దేరండి..'' చెప్పాడు.
ఏమై వుంటుందా అని ఆలోచిస్తూ 'ఆ సరేరా' అని ఫోన్‌ పెట్టేసాడు రామచంద్రం. కాసేపు అలాగే కూర్చొని ఆలోచించి ఏం అర్థం కాక అక్కడి నుంచి లేచి 'లక్ష్మి ' అని పిలుస్తూ లోపలికి వచ్చాడు.
వంట చేస్తున్న లక్ష్మి భర్త పిలుపుకి 'చెప్పండి' అంటూ బయటకు వచ్చింది.
''కిరణ్‌ ఫోన్‌ చేసిండు. ఏమయిందో తెలివదు. ఏదో బాధలో ఉన్నట్టున్నడు. నన్ను రమ్మన్నడు'' చెప్పాడు.
''అయ్యో ఏమైంది'' కంగారుగా అడిగింది లక్ష్మి.
తొందరగా వెళ్ళాలి అన్నట్టు 'వెళ్తే గానీ తెలియదు' అంటూ గాబరగా లోపలికి వెళ్ళాడు. అతను రెడీ అయి వచ్చేలోపు టిఫిన్‌ రెడీ చేసి పెట్టింది లక్ష్మి.
భర్త రాగానే వడ్డిస్తూ ''ఏమయుంటది.. ఎందుకు ఇంత జెట్టన రమ్మన్నడు'' అడిగింది.
ఏదో ఆలోచిస్తూ ''ఏమో నేను అదే ఆలోచిస్తున్న. మనవడి గురించే కావొచ్చు. నువ్వేం పరేశాన్‌ గాకు. ఏదో చిన్న గొడవ అయుంటది. నేను పొద్దు గూకే వరకు వత్త.'' చెప్పి చేయి కడుక్కొని బైటికి వచ్చాడు.
''మీరొక్కరే ఎట్లపోతరు. తోడుగా నేను రానా'' అడిగింది లక్ష్మి.
వద్దని చెప్పి బస్టాండ్‌కు వెళ్లి కరీంనగర్‌ బస్సు ఎక్కి కూర్చున్నాడు రామచంద్రం. బస్సు కదిలింది. బస్సుతో పాటూ అతనిలో ఆలోచనలూ కదిలాయి. తన కొడుకు గురించి సరిగ్గా చదవకుండా అతడు పెట్టిన బాధల గురించి ఆలోచనలో పడ్డాడు.
రామచంద్రం గణితం బోధించే స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌. రిటైర్‌ అయ్యాడు. అతనికి ఒక్కడే కొడుకు కిరణ్‌. కిరణ్‌ను బాగా చదివించి గొప్ప ప్రయోజకుడిని చేయాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కనేవాడు. కిరణ్‌ కూడా తండ్రి మాట కాదనే వాడు కాదు. బాగా చదివేవాడు. కొడుకును డాక్టర్‌ చేయాలి అని రామచంద్రం కోరిక. ఆ విషయమే కొడుకుతో పదవ తరగతి పాస్‌ కాగానే చెప్పాలి అనుకున్నాడు. అలా కిరణ్‌ పదవ తరగతి మంచి మార్కులతో పాస్‌ అయ్యాడు.
ఒక రోజు లక్ష్మి రామచంద్రం కిరణ్‌ ముగ్గురు భోజనం చేస్తున్నారు. రామచంద్రం కొడుకుతో ''కిరణ్‌ నేను డాక్టర్‌ అవ్వాలి అనుకున్న రా. కాని కాలేకపోయిన. నువ్వయినా డాక్టర్‌ అవ్వాలిరా. ఎంత ఖర్చయినా సరే నిన్ను డాక్టర్‌ చదివిస్తా.. ''కొడుకు ఒప్పుకుంటాడనే ధైర్యంతో చెప్పాడు రామ చంద్రం.
కిరణ్‌ అదేదో జోక్‌లా నవ్వి ''నేను డాక్టర్‌ అవడం ఏంటి నాన్న... నాకు సైన్స్‌ అంటే అసలు నచ్చదు. ఆ బొమ్మలు వేయడం అసలే రాదు. నేను ఎంపీసీ తీస్కుంట'' చెప్పాడు.
రామచంద్రం కొడుకు మాటలకు మొదటిసారిగా షాక్‌ తిన్నాడు. వెంటనే సర్దుకుని చిన్నగా నవ్వి ఏదో ఒకలా నచ్చ చెప్పాలనుకుని ''అది కాదురా... కుటుంబంలో ఒక డాక్టర్‌ ఉంటే ఎంతో మంచిది. ఏ సమయం వచ్చినా ధైర్యంగా ఉంటది. అది నువ్వే ఐతే మన కుటుంబానికంతటికి ఆసరా. నీకు తెలుసా.. సమాజానికి ఎంతో కొంత సేవ చెయ్యాలంటే అది డాక్టర్‌ వల్లనే సాద్యం'' అన్నాడు.
''సమాజానికి సేవ చేయాలంటే సవాలక్ష జాబులుంటయి. అయినా చెప్పిన గదా.. నాకిష్టం లేదని. నాకూ కొన్ని ఇష్టాలుంటయి..'' కఛ్ఛితంగా అన్నాడు కిరణ్‌.
రామచంద్రం అయోమయంగా భార్య వైపు చూసాడు. మారన్నం వడ్డిస్తూ ''నాన్న చెప్పేది ఒకసారి వినురా... డాక్టర్‌ ఐతే నీకు ఎంతో విలువ ఉంటది కదా'' చెప్పింది లక్ష్మి.
ఇద్దరు అలాగే అనేసరికి చిరాకుతో ''కాని నాకు ఇష్టం లేదమ్మా.. ప్లీజ్‌. నాకు నచ్చింది నన్ను చదువుకోనివ్వండి'' అన్నాడు.
తల్లికి కోపం వచ్చింది. ''ఏంట్రా నీ ఇష్టం. అది మాత్రం చదువు కాదా.. ఏంది. చెప్పింది విను. అప్పుడే అంత పెద్దోడివై పోయినవా..'' అన్నది.
కిరణ్‌ కోపంగా చూసాడు. ''మరి ఇది మాత్రం చదువు కాదా ఏందీ.. థూ..నీయవ్వ,,'' అంటూ తినకుండా మధ్యలోనే ప్లేట్లో చేయి కడిగి వెళ్ళిపోయాడు. ఇద్దరూ బాధగా నమ్మలేనట్టుగా ఒకరిమొఖాలు ఒకరు చూసుకున్నారు.
''ఏంటండీ.. ఎన్నడూ లేనిది వాడిలా మాట్లాడుతున్నడు.ఆ వాసు గాడే చెప్పినట్టున్నడు'' బాధగా అడిగింది లక్ష్మి.
బాధగా ''ఏం చేద్దాం వానికి ఇష్టం లేదంట'' చెప్పాడు రామచంద్రం.
అర్థం కానట్టుగా ''అదేంటండి మీరూ అలాగే అంటరు. ఇష్టం లేదు అంటే ఎలా. ఒప్పించాల్సిందే'' చెప్పింది లక్ష్మి.
రామచంద్రం చేయి కడుక్కుంటూ ''ఇష్టం లేదు అని అంత గట్టిగ చెప్పినంక ఇంకేం చేస్తం చెప్పు లక్ష్మి.. గుర్రాన్ని నీళ్ల దగ్గరికి తీసుకపోతం గనీ నీళ్లను తాగిస్తమా.. ఇది అంతే'' చెప్పి లేచాడు.
భర్త ఎంత బాధ పడుతున్నాడో అర్థం అయింది లక్ష్మికి. కిరణ్‌ను ఎలాగైనా ఒప్పించాలనుకుంది. లేచి డైనింగ్‌ టేబుల్‌ సర్ది లోపలికి వెళ్ళింది. లక్ష్మికి వదిలేరు అని చెప్పాడు కాని రామచంద్రం మాత్రం వదలలేకపోయాడు. కొడుకు గురించే ఆలోచిస్తూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
'నా కొడుకును డాక్టర్‌ చేయాలని ఎంతో కోరుకున్న. అప్పటి పరిస్థితిలో చదివించే వాళ్ళు లేక దొరికిందే బంగారం అనుకోని టీచర్‌ అయిన. కనీసం వాడైనా డాక్టర్‌ అవుతడనుకున్న. ఎంత కష్టపడ్డా సరే వాడిని డాక్టర్‌ చేయాలి అనుకున్న. కానీ వీడేంటీ... ఇలా అంటున్నడు' అనుకుంటూ తనలో తానే బాధపడ్డాడు రామచంద్రం.
అన్నం తినకుండా వెళ్ళిన కిరణ్‌ తన గదిలో అటు ఇటు తిరుగుతూ 'ఏంటి.. నాన్న డాక్టర్‌ అవ్వాలె అనుకొని కాలేదు. దానికి ఇప్పుడు నన్ను డాక్టర్‌ చదవమంటడా.. నాకు ఇష్టం ఉండాలె కదా. తనకు అప్పుడు డాక్టర్‌ అవ్వాలి అని ఎట్ల ఉందో ఇప్పుడు నాకు ఇంజనీర్‌ అవాలి అని అట్ల ఉంది. అది అర్థం చేసుకోరేంటి. అమ్మ కూడా నాన్నకే సపోర్ట్‌ చేస్తది. నాకెందుకు సపోర్ట్‌ చేయది. వాళ్ల అభిప్రాయాలు నామీద రుద్దుతరేందీ.. రేపు పొద్దున ఎలాగైనా నాన్నని ఒప్పించాలి' అనుకున్నాడు.
తెల్లారింది. లక్ష్మి టీ టిఫిన్‌ తీసుకొని వచ్చి డైనింగ్‌ టేబుల్‌ పైన పెట్టి కిరణ్‌ను రామచంద్రంను పిలిచింది. తండ్రికి ఎదురవ్వాలి అంటే ధైర్యం చాలలేదు కిరణ్‌కి. కొడుకు మొహం చూడాలి అంటే చిరాకేసింది తండ్రికి. ఇద్దరు మొహం కిందకు వేసుకొని ఒకరికి ఒకరు సంబంధం లేదు అన్నట్టుగా తింటున్నారు. అది చూసి లక్ష్మి ఇద్దరు నిన్నటి సంఘటన నుండి బయట పడలేదని గుర్తించింది.
''చదువు గురించి ఏం ఆలోచించినవురా..'' మెల్లిగా అడిగింది కొడుకుని తల్లి.
చెప్పాలా వద్దా అన్నట్టుగా తడబడుతూ ''చెప్పిన గదమ్మా.. ఎంపీసీ తీసుకుంటనని. ఎన్ని సార్లు చెప్పాలె'' అన్నాడు.
ఆశగా ఎదురుచూస్తున్న ఇద్దరికి అతని నిర్ణయం మారదని తెలిసిపోయింది. ఒకరినొకరు బాధగా చూసుకున్నారు. ఏదో అనాలనుకుంది లక్ష్మి. కాని తినకుండా మధ్యలోనే వెళ్ళిపోతాడని భయపడి మానుకుంది.
ఎవరూ ఏం మాట్లాడలేదు. కిరణ్‌ తిని వెళ్లిపోయాడు.
లక్ష్మి భర్త దగ్గరికి వెళ్ళి ''ఏంటండీ మీరేం మాట్లాడలేదు'' అడిగింది.
రామచంద్రం దిగులుగా ''ఏం మాట్లాడాలె. వానికి ఇష్టం వచ్చింది చేసుకుంటనని అంత కచ్చితంగా చెప్పిండు గదా. చేసుకొని ఇంకేంది'' అన్నాడు.
అలా కాదని మెల్లిగా సముదాయిస్తున్నట్టుగా ''అట్లని వదిలేయలేం గదా.. పిల్లలకేం తెలుసండీ.. అంతా వాడిప్పుడు పద్నాలుగేండ్లు.. మంచి చెడ్డలు నిర్ణయం తీసుకునే వయసెక్క డిది చెప్పు. మనమే బలవంతంగానైనా ఒప్పించాలె'' అన్నది.
''మన మాట కొంతనన్నా వినాలె గదా.. గట్ల మొండికేసి మాట్లాడితే ఏం జేస్తం.. అసలే రోజులు బాగ లెవ్వు.. వాడు అలిగి ఎటన్నవోతె యాడ దేవులాడుతం. నలుగురు మననే అంటరు..'' అన్నాడు రామచంద్రం.
నిదానంగా ''అట్లని వదిలి పెడితే వాని ఫ్యూచర్‌ ఎట్లచెప్పు.. ఇప్పుడు పిల్లలు అందరు ఇంజనీర్‌ కే పోతున్రు. ఇప్పుడే జాబులు దొరకడం కష్టంగా ఉంది. ముందు ముందు అసలే ఉండదు'' వివరంగా చెప్పింది.
''ఏమోలే మన అదష్టం ఎట్లుంటే గట్లయితది. మన ప్రయత్నం మనం చేద్దాం..'' చెప్పాడు.
అక్కడ గదిలో కిరణ్‌ బాధగా కూర్చున్నాడు.
''ఏమైందిరా.. గట్ల కూసున్నవ్‌.. ఆ..'' అడిగింది తల్లి.
కిరణ్‌ బాధగా ''ఏమోనమ్మ.. నాన్న మాట్లాడకుంట ఉంటే నాకు భయమయితంది. ఏడుపొస్తుంది'' బాధపడ్డాడు.
తల్లి ఓదార్పుగా తలపై చేయి వేసి ''అట్లనుకుంటే నాన్న మాటే వినచ్చు కదరా...'' అడిగింది.
తల్లిని చూస్తూ ''అది కాదమ్మా... నువ్వే చెప్పు. నాన్నకి డాక్టర్‌ గావాలనే కోరిక ఉన్నట్టు నాకూ ఇంజనీర్‌ గావాలనే కోరిక ఉంటది గదా... అది అర్థం చేసుకోరెంది'' ఆవేదనగా అన్నాడు.
కొడుకు మాటలను బట్టి మారుతాడన్న ఆశ కనిపింలేదు లక్ష్మికి. కొద్దిసేపు ఇద్దరు అలాగే కూర్చున్నారు. తల్లి ఏదో చెప్పబోతుంటే 'నాకు తెలుసు. నువ్వు నాన్నకే సపోర్ట్‌ చేస్తవు నాకు చెయ్యవని' అంటూ వెళ్ళిపోయాడు.
''టికెట్‌... టికెట్‌ తీస్కోండి... ఎక్కడికెళ్ళాలి'' అడిగాడు కండక్టర్‌.
ఆ మాటలకి ఆలోచనల్లోంచి తెరుకున్నాడు రామచంద్రం.
''ఆ.. కరీంనగర్‌'' అంటూ జేబులోంచి యాబై రూపాయలు తీసి ఇచ్చాడు. కండక్టర్‌ టికెట్‌తో పాటు చిల్లర తిరిగి ఇచ్చాడు.
రామచంద్రం అదే బాధలో ఉన్నాడు. 'నా జీవితం ఒక అద్దాలమేడ. బైట నుండి చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. లోపలికి వచ్చి చూస్తే కదా అందులో ఏముందో తెలిసేది. అందరు జాబ్‌ ఉంది. ఒక కొడుకు.. అదష్టవంతుడు అనుకుంటరు. ఆ జాబ్‌ వల్ల వచ్చే చాలీచాలని జీతం కొడుకు వల్ల పడే బాధలు ఎవలకు తెలుసు. వత్తి పరంగా నేను ఎందరికో మార్గదర్శి అయిన. వ్యక్తిగతంగా పది మందికి ఆదర్శం అయిన. బైటికి వెళ్తే నా సలహాల కోసం ఎదిరి చూసే వాళ్లుంటారు. అలాంటిది నా కొడుకుకి మంచి భవిష్యత్తు ఇవ్వలేక పోయిన. మంచి వ్యక్తిత్వం ఇవ్వటంలో ఓడిపోయిన.' అనుకుంటూ మళ్ళీ గతం తాలూకు ఆలోచనలో పడ్డాడు.
కొడుకు పట్టుబట్టి చెప్పినా వినకుండా ఎంపీసీ తీసుకున్నాడు. తర్వాత నా ఇష్టం నా వ్యక్తిత్వం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇంజనీర్‌లో చేరాడు. ఒక రోజు రాత్రి పది దాటింది. కొడుకు ఇంకా ఇంటికి రాలేదు. కొడుకు కోసం కంగారుగా ఎదురు చూస్తున్నాడు రామచంద్రం. టైం ఒక్కటి దాటింది. ఇంకా రాలేదు. ఎప్పుడైనా ఆరింటి వరకు వచ్చే వాడు. ఎంత లేటయినా తొమ్మిది వరకైతే తప్పక వచ్చేవాడు.
''ఇంకా రాలేదు ఎందుకు.. ఎటైనా వెళ్తనని చెప్పిండా'' అడిగాడు.
లక్ష్మికి ఏదో భయమేసింది. ''పొద్దున కాలేజీకని వెళ్ళాడు అంతే ఇంకేం చెప్పలేదు'' అన్నది.
ఇద్దరికి భయం వేసింది. టైం రెండు దాటింది. గేట్‌ చప్పుడయింది. ఇద్దరు అటువైపు చూసారు.
''ఓకే రా.. రేపు కలుద్దాం. బారు రా గుడ్‌ నైట్‌'' ఎవరికో చెప్తున్నాడు కిరణ్‌.
రామచంద్రం వాళ్ళను చూసాడు. రెండు బైక్‌ల మీద ఐదుగురు కిరణ్‌ వయసున్న పిల్లలు వున్నారు. ఏదో కామెంట్స్‌ చేస్తూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. కిరణ్‌ ఏదో పాట పాడుతూ గంతులు వేస్తూ లోపలికి వచ్చాడు.
''ఎక్కడికి వెళ్ళావురా'' అడిగింది లక్ష్మి.
కిరణ్‌ నిర్లక్ష్యంగా ''ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్లానమ్మా'' తూలుతూ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
రామచంద్రం ఏం మాట్లాడకుండా వెళ్లి పడుకున్నాడు.
లక్ష్మి భర్త దగ్గరికి వెళ్లి దిగులుగా ''ఈ మధ్య వాడి వాలకం ఏం బాగ లేదండి. ఎప్పుడు ఫ్రెండ్స్‌ అంటూ పార్టీలంటూ తిరుగుతున్నడు'' చెప్పింది.
లేచి కూర్చొని ''చెప్పుతున్న.. ఎంత చెప్పినా వింటలేడు. గట్టిగ చెప్పితే అలుగవట్టె.. చూద్దం.. బాగానే చదువుతున్నాడు గదా..'' చెప్పాడు.
అంతే దిగులుతో ''నేను అలాగే అనుకున్న కాని ఈ మధ్య వాడు కాలేజీకి వెళ్ళలేదని మెస్సేజ్‌ వచ్చింది. ఎందుకు అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండు.. తాగుతున్నట్టు అనుమానంగా కూడా ఉంది. ఇట్ల వదిలేస్తే ఎట్లండీ'' అన్నది.
ఆ మాటలు విన్నాక రామ చంద్రంకి భయం వేసింది. భయంతో తన మనసులోనే ''రోజులు బాగ లేవు. యువత ఎట్ల తయారవుతుంది. ఎంజారు అంటూ తిరుగుతున్రు. గతంలో అనుభవం లేదు. ప్రస్తుతం పైన బాధ్యత లేదు. భవిష్యత్తు మీద ఆలోచన లేదు. అదే జీవితం అనుకుంటున్రు.'' అనుకున్నాడు.
లక్ష్మి దిగులుగా ''ఏమైంది.. నా మాటలు వింటున్నరా'' అడిగింది.
ఆ పిలుపుకి ఆలోచనలో నుండి తెరుకొని ''ఆ అదే ఆలోచిస్తున్న రేపు ఒకసారి వాడితో మాట్లాడుత'' అన్నాడు.
లక్ష్మి వెళ్లి పడుకుంది. రామచంద్రం ఆలోచిస్తున్నాడు.
తెల్లారింది. ఆరోజు ఆదివారం. పొద్దున రామచంద్రం పేపర్‌ చదువుతున్నాడు. లక్మి వంటగదిలో ఏదో పని చేస్తుంది. కిరణ్‌ అప్పుడే లేచి వచ్చి టీవీ పెట్టుకొని తండ్రి పక్కనే కూర్చున్నాడు.
రామచంద్రం పేపర్ని మలుస్తూ ''అరేరు.. పొద్దున లేచి ఆ టీవీ చూడకుంటే ఈ పేపర్‌ చదువచ్చు కదా.. కొంచం బైట సమాజం ఎలా ఉందో తెలుస్తుంది'' చెప్పాడు.
రిమోట్‌తో ఛానెల్‌ మారుస్తూ ''సమాజం ఎలా ఉందో బైటికి వెళ్తే తెలుస్తుంది.. పేపర్లో కాదు..'' చెప్పి వెంటనే ''అమ్మ టీ తీసుకరా బైటికి వెళ్ళాలి'' చెప్పాడు.
చిరాగ్గా పేపర్‌ పక్కన పడేసి ''ఈ రోజు ఎటెల్తవ్‌ రా.. కాలేజీ లేదుగా'' అడిగాడు.
విసుగ్గా లేచి ''అబ్బ నాన్న.. నన్ను కొంచెం ఎంజారు చేయని. రోజు కాలేజీకేగా వెళ్ళేది. ఈ రోజు ఫ్రెండ్స్‌తో తిరిగొస్తా'' అంటూ లేచాడు. రామచంద్రం కొడుకు వైపు విచిత్రంగా చూసాడు.
కిరణ్‌ బైటికి వెళ్తు ''వీళ్లేప్పుడు మారుతరో ఏమో. ఎప్పుడు చూడు చదువు, కాలేజీ, సమాజం, భవిష్యత్తు అని మాట్లాడుతరు. వారానికి ఒక్కరోజు వస్తుంది. ఆ రోజు కూడా నన్ను ఎంజారు చేయనివ్వరా. ఇంకెప్పుడు ఎంజారు చేస్తమ్‌. బీటెక్‌ ఐపోయినంక జాబ్‌, ఆ తర్వాత ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీస్‌ ఎన్ని ఉంటరు. ఏదేమైనా సరే ఇప్పుడే బాగా ఎంజారు చేయాలి'' అనుకుంటూ ఫ్రెండ్‌ ఇంటికి వెళ్ళాడు.
రామచంద్రం అలాగే కూర్చున్నాడు. లక్ష్మి టీ తీసుకొని వచ్చింది. కొడుకు గురించి అడిగింది. టీ తీసుకుంటూ విషయం చెప్పి ''ఇదీ వాడి వాలకం. ఏం అడిగినా ఇలాగే జవాబు చెప్తున్నడు. ఈ మద్య నా మీదికే మర్రవడుతున్నడు. ఇలాంటి వాడికి ఏం చెప్తం'' అంటూ బాధపడ్డాడు.
రోజులు గడుస్తున్నాయి. కిరణ్‌లో మార్పులేదు. అడిగితే ఎంజారు అంటున్నాడు. యూత్‌ అంటున్నాడు.
కొడుకు బాధను మనవడి తిరుగుళ్ళను చూడలేక ఓసారి రామచంద్రం తండ్రి అతడిని కూర్చోబెట్టుకుని చదువు గురించి, చదువుకోవడం వల్ల లాభం గురించి చెప్పి ఐదేండ్లు కష్టపడి చదివితే యాభై ఏండ్లు సుఖపడతావని చెప్పాడు. కిరణ్‌ ఎగతాళి చేసాడు. ముసలి ఆలోచనలు అని కొట్టి పారేసాడు. తనకు ఏం చెయ్యాలో ఎప్పుడు చదువాలో తెలుసని మరోసారి ఇలా నీతులు చెప్పొద్దని హెచ్చరించాడు.
ఓ రోజు లక్ష్మి బాధగా ''వాడిలా తయారవుతాడనుకోలేదు'' అన్నది.
''వాడు మన చెయ్యి జారి పోయిండు లక్మి. మన అభిప్రాయాలు వాడి మీద రుద్దలేదు. చదువు విషయంలో వాని ఇష్టానికే వదిలేసినం. కనీసం వాడు ఇష్టపడి తీసుకున్న కోర్సయినా చక్కగా చదువొచ్చు గదా.. చదువును పూర్తిగా పక్కన పెట్టిండు. ఇప్పుడు మనం ఏం చెప్పినా వినేలా లేడు. మన బాధ వాడికి ఇప్పుడు అర్థం కాదు. రేపు వాడి పిల్లలు ఇట్లనే చేస్తే అప్పుడు అర్థమవుతుంది'' అంటూ బాధపడ్డాడు.
ఒక్కసారిగా కిటికీలోంచి చల్లని గాలి వీచింది. గతం లోంచి తేరుకుని కిటికీ బైటికి చూసాడు రామచంద్రం. బస్సు కోదురుపాక బ్రిడ్జి పైన ఉంది. చుట్టూ నీళ్లు. ప్రశాంతమైన వాతావరణం. ఒక నిమిషం పాటు అలాగే చూస్తుండి పోయాడు. బస్సు బ్రిడ్జి దాటింది. నీళ్లు వెళ్లిపోయాయి. ప్రశాంతత వెళ్ళిపోయింది. మళ్లీ గుండె బరువెక్కింది.
ఎంతో ప్రయోజకుడు అవుతాడు అన్న కొడుకు బీటెక్‌ ఐపోయాక హైదరాబాద్‌లో ఆఫిస్‌ల చుట్టూ తిరిగి కొన్ని రోజులు పది వేలకు సాఫ్ట్వేర్‌గా చేసి ఆ జీతంతో బతకడం నావల్ల కావడం లేదని ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే పెళ్లయింది. ఓ కొడుకు. ఖాళీగా తిరుగుతుంటే చూడలేక కరీంనగర్‌లో చిన్న షాపు పెట్టించి నెలనెలా తనే డబ్బులు పంపిస్తున్నాడు.
''ఆ... రాం నగర్‌... కరీం నగర్‌...'' అంటూ అరిచాడు కండక్టర్‌. బస్సు ఆగింది. రామచంద్రం దిగాడు. అక్కడి నుండి టవర్‌ దాటి కొంచెం ముందుకు వెళ్లి సందులోకి వెళ్తే కొడుకు కిరాయి వున్న ఇల్లు వచ్చింది. రామచంద్రం లోపలికి వెళ్ళాడు.
కిరణ్‌ సోఫాలో రెండు మోచేతులను మోకాళ్ళపై పెట్టి వేళ్ళతో తల పట్టుకొని కూర్చున్నాడు. పక్కనే మనవడు నవీన్‌ ఏదో కోపంతో ఉన్నాడు. ఆ దశ్యం చూస్తుంటే ఓరోజు తను అలాగే కూర్చున్నది గుర్తుకు వచ్చి అలాగే నిలబడ్డాడు రామచంద్రం.
కిరణ్‌ బీటెక్‌ ఐపోయినా అలాగే ఎంజారు అంటూ తిరుగుతున్నాడు. ఏమైనా అంటే కంపెనీలకి అప్లై చేశా. రేపో ఎల్లుండో పిలుస్తారు అంటున్నాడు.
ఒక రోజు కొడుకు బైటికి వెళ్తుంటే కోపంగా ''ఎక్కడికిరా.. రోజు ఇదే తిరుగుడా.. ఇగనన్నా లైఫ్‌లో సెటిల్‌ అవ్వవా'' గట్టిగా అడిగాడు రామచంద్రం.
కోపంగా ''ఎందుకు సెటిల్‌ అవను. మొన్ననే కదా బీటెక్‌ ఐపోయింది. ఇంకా మస్త్‌ టైం ఉంది.'' అన్నాడు కిరణ్‌.
రామచంద్రం ఎదో అనబోతుంటే ఆవేశంగా ''అవన్నీ నాకు తెలుసు... ఎవరేం సలహా ఇవ్వల్సిన అవసరం లేదు..'' అని పక్క నుండి వెళ్ళిపోయాడు. కొడుకు ఏమైపోతాడో అన్న బాధతో ఆరోజు తన తండ్రితో బాధను చెప్పుకుంటూ ఇలాగే కూర్చున్నాడు. అదిప్పుడు గుర్తుకొచ్చింది.
''రండి మామయ్య అక్కడే నిలబడ్డరు'' లోపలి నుండి పిలిచింది కోడలు రమ.
ఆ మాటలకు తిరిగి చూసాడు కిరణ్‌. లేచి ''రండి నాన్న'' అన్నాడు. తాతను చూసి నవీన్‌ మొహం తిప్పుకున్నాడు.
రామచంద్రం వెళ్ళి కొడుకు పక్కన కూర్చున్నాడు. కిరణ్‌ బాధగా ''చూడు నాన్నా.. నేను బైపీసీ తీసుకుని డాక్టర్‌ చదువుమన్న. కాదు ఆర్ట్స్‌ తీసుకుని గ్రూప్స్‌ ప్రిపేరవుతానన్నడు. బాగా చదివితే చాలని సరే అన్న. ఇప్పుడు బియ్యేలోనే ఫేలయిండు. సరే చదువుకోరా అంటే కాదని ఏదో బిజినెస్‌ చేస్తడట. ఇదేందిరా అంటే నాకూ ఇష్టాయిష్టాలుండవా అంటున్నడు. చెప్పితే వినక నేనే చెడిపోయిన. కనీసం వీడయినా చదువుకుని బాగుపడత డంటే ఇదీ పద్ధతి'' చెప్పాడు.
రామచంద్రం మనవడిని దగ్గరకు తీసుకుని 'ఇష్టాలు ఉండడంలో తప్పులేదురా.. కానీ దానిని ఒక నెపంగా చూపడమే తప్పంటున్న. చిన్నప్పుడు నీకు తినడమే ఇష్టం లేదు అని వదిలిపెట్టినమా.. కొన్ని మంచి
పనులను మనం బలవంతంగానైనా ఇష్టం చేసుకోవాలె..' అంటూ ఏదో చెప్పబోయాడు.
తాతను చూసి ఆవేశంగా ''మీరింతే.. మీరూ మీ చాందసాలూనూ... ఎప్పటికి మారరు. ఎప్పుడేం చేయాలో అన్నీ నాకు తెలుసు. ఎవరేం సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు..'' దురుసుగా అంటూ వెళ్ళిపోయాడు.
రామచంద్రం నొచ్చుకుంటున్నట్టుగా కొడుకు వైపు చూస్తూ ''వీడేందిరా ఇట్ల తయారైండు. అంతా తెలుసంటున్నడు. ఏం తెలుసట్రా వీనికి. చదవడం చేతగాక దానికి ఇష్టమని పేరు పెట్టుకున్నడు..'' అన్నాడు.
కిరణ్‌ ఒక్కసారిగా పక్కున పగిలి ఏడ్చాడు. ఏడుస్తూ ''సారీ నాన్నా... వెరీ సారీ.. పాతికేండ్ల కింద నువ్వెంత బాధ పడ్డవో నాకు ఇప్పుడర్థమయింది. నేను దిద్దుకోలేని తప్పును చేసిన. అది తప్పని తెలుసుకునే సరికి టైం దాటిపోయింది. కనీసం ఆ తప్పు నా కొడుకు చెయ్యకూడదనుకున్న. కాని వాడు అదే చేస్తున్నడు. చెప్పినా వానికి అర్థమైతలేదు. ఇప్పుడు నా కొడుక్కు ఏవో బుద్దిమాటలు చెప్పాలని నిన్ను రమ్మనలేదు. నీ కొడుకుగా బుద్ది తక్కువ పని చేసి నిన్ను బాధ పెట్టినందుకు సారీ చెప్పాలనిపించి పిలిచిన. నాన్నా..సారీ నాన్నా... సారీ..'' ఏడుస్తున్నాడు కిరణ్‌.
రామచంద్రం కళ్ళల్లో నీళ్ళు. పాడైపోయిన కొడుకు జీవితం గురించి కాదు. పాడవబోతున్న మనవడి జీవితం గురించి... ఇష్టాలని, అభిప్రాయాలని, స్వేచ్ఛ అని, మాకే తెలుసని, ఎంజారు అని, పాత ఆలోచనలని ఏవేవో మట్లాడి కనీసం బుద్ది తెలిసే వరకన్నా ముఖ్యమైన నిర్ణయాలను పెద్దలకు వదిలేయలేక, అలాగని సరియైన నిర్ణయాలు తీసుకోలేక తప్పు దారి పడుతున్న మనవడిలాంటి యువతరం గురించి అలోచిస్తున్నాడు.

- శృతి వెన్నెల పెద్దింటి,

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
పుట్టిన ఊరు
ముసుగు

తాజా వార్తలు

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.