- పక్కా వ్యూహం, కార్యాచరణతోనే నియంత్రిత సాగు విధానం సక్సెస్
- అక్టోబర్‌లోగా ప్యాకేజీ -9 ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు
- రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు
నవతెలంగాణ-సిరిసిల్ల
రైతుబంధును ఎవ్వరికీ ఎగ్గొట్టబోమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తేల్చిచెప్పారు. రైతాంగానికి సాధ్యమైనంత మేర ఎక్కు ప్రయోజం కలిగించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతికి శ్రీకారం చుట్టింది చెప్పుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వానాకాలం సాగులో నియంత్రిత పద్ధతి, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి, భూసేకరణ ప్రగతి తదితర అంశాలపై రైతుబంధు సమితి అధ్యక్షులతో, సంబంధిత అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పకడ్బందీ వ్యూహం, కార్యాచరతో ముందుకు సాగితేనే నియంత్రిత సాగు విధానంలో రాష్ట్రం ప్రపంచానికి నమూనాగా నిలుస్తుంద్నారు. రైతు బంధు అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో గతంలో 12 వేల కోట్ల రూపాయలను కేటాయించగా ప్రస్తుత సంవత్సరం 14 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. రైతుబంధు సాయంతోపాటు విద్యుత్, సాగునీరు, విత్తనాలు, ఎరువులు.. ఇలా అన్ని ప్రభుత్వమే రైతులకు సమకూర్చు తుందన్నారు. వానకాలం సాగుకు సంబంధించి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయితీ లో రైతు వారీగా సాగుచేసిన పంట వివరాలు ప్రదర్శించాలన్నారు.
నియంత్రిత విధానంలో ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసిన ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామని మంత్రి తెలిపారు. పండ్ల తోటల పెంపకం, కాయగూరలు సాగు చేసే రైతులు, విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులకు రైతుబంధు ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రతి రైతుకు గతంలో మాదిరి రైతుబంధు రైతుబంధు సమితి సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి తెలిపారు.వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు అన్ని విధాలుగా సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21 చోట్ల కేసీఆర్ ప్రగతి ప్రాంగణాలు పూర్తి చేయగా మిగతా గ్రామాలలో వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వీటిని రైతు వేదికలకు అనుసంధానంగా చేసుకుంటూ మరింత సౌకర్యంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలో సాగునీటి సౌకర్యం మెరుగు పడడంతో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కళ్లాల ఇబ్బంది లేకుండా చూసేందుకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో కల్లాలను నిర్మించుకునేలా చూడాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకౌటిల్యరెడ్డిని మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సాగునీటి ఫీడర్ చానల్స్‌ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అక్టోబ ర్‌లోగా ప్యాకేజీ -9 ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
వంతెనలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ముస్తాబాద్: మండలంలోని తెర్లుమదిద, కొండాపూర్, ముస్తాబాద్, పోతుగల్ గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన నూతన వంతెనను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు రెండు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అయ్యాయన్నారు. గతంలో ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి రావడం చాలా కష్టతరంగా ఉండేదని తెలిపారు. 9 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో కొండాపూర్ -నారాయణపూర్ గ్రామాల మధ్య నిర్మించిన వంతెనను, 2 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో తంగల్లపల్లి మండలం భరత్ నగర్‌లో నిర్మించిన వంతెనను, 7 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో పోత్గల్ -గండి లచ్చపేట గ్రామాల మధ్య నిర్మించిన వంతెనను, 2 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో ముస్తాబాద్ మండలం తెర్లుమద్దినిర్మించిన వంతెనను, కోటీ 40 లక్షల రూపాయల వ్యయంతో ముస్తాబాద్ మండలం హనుమానగర్‌లో నిర్మించిన వంతెన తో పాటు 30 లక్షల రూపా యలతో ఏర్పాటు చేసిన సెస్ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన వెంట కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్డీవో శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు కిషన్ రావు, సుమతి, గౌతం రావుతో పాటు ఎంపీపీ శరత్ రావు, జెడ్పీటీసీ నరస య్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపాల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది మల్లేష్, సెస్ డైరెక్టర్ విజయ రామారావు, సహకార సంఘం చైర్మన్ లు బాపు రావు, రాజేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్‌రావు తదితరులు ఉన్నారు.
టీఆర్‌ఎస్ కార్యకర్త బాబు కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ
ఎల్లారెడ్డిపేట : మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ క్రీయశీలక కార్యకర్త కుంట బాబు ఇటీవల గుండె పోటుతో మరణించగా మంగళవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కుంట బాబు ఇంటికి వెళ్లి బాబు భార్య మంజులను, బాబు సోదరుడు శ్రీనును పరమర్శిం చారు. బాబు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్నీ విధాలుగా ఆదుకుంటామని, మంజులకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం, బాబు కుమారులు యశ్వంత్, జశ్వంత్, కూతురు శ్రీమణ్యల పేరిటా బ్యాంకులో ఖాత తెరిచి టిఆర్‌ఎస్ పార్టీ ఫండ్ జమ చేస్తామని, డబుల్ బెడ్ రూం ఇప్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, సర్పంచ్ కొత్తపల్లి వాణి, ఎంపీటీసీ పద్మ దేవయ్య, నర్సాగౌడ్, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Authorization