నవతెలంగాణ-చొప్పదండి
కొన్ని ఏండ్లుగా ఎడారిగా ఉన్న చొప్పదండి నియోజకవర్గాన్ని చివరి ఆయకట్టు వరకు నీరు అందించి సస్యశ్యామలం చేశామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ప్రధానంగా మెట్ట ప్రాంత రైతుల కోసం మోతే రిజర్వాయర్‌ను రూ.271 కోట్లతో చేపట్టి రామడుగు, చొప్పదండి మండలాల్లో 30వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు పనులు ప్రారంభించామని తెలిపారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 'నవతెలంగాణ'తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గంగాధర మండలంలో కుడి కాలువ పనులను ప్రారంభించామని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గం లోని 6మండలాల్లో ప్రతి గ్రామంలో కుల సంఘాల భవనాలకు రూ.45కోట్లకు పైగా నిధులు కేటాయించి నిర్మించామని తెలిపారు. ప్రతి మండలంలో రహదారుల కోసం రూ.30 కోట్లతో సుందరీకరణ చేశామని తెలిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసి, ఆమర నిరాహార దీక్ష చేపట్టి బంగారు తెలంగాణ సాధించార న్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కృషి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను అందిస్తూ ఏకైక ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతున్నారని చెప్పారు. ప్రపంచవ్యా ప్తంగా ప్రజలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోనే విదేశాలలో నుండి అత్యధికంగా చొప్పదండి నియోజకవర్గం లో 550మంది ఉండగా వారిని సురక్షితంగా రప్పించామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై అనునిత్యం కరోనా వైరస్ పట్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు.
Authorization