Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్యాల : ఈ నెల 11న జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ చూపిన స్థానిక ఎన్‌ఎస్వీ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. అండర్ 14 బాలుర విభాగంలో హర్షవర్ధన్, శ్రీరాం, వినరు, అన్షిత్, సాయి మోక్షిత్, బాలికల విభాగంలో జైబా, రవిత్రయిని ఎంపికయ్యారు. అలాగే అండర్ 17 బాలుర విభాగంలో ఖలీజ్, సాయిచరణ్, విజ్ఞాన్ తేజ ఎంపికయ్యారని విద్యా సంస్థల చైర్మెన్ నవీన్‌రెడ్డి బుధవారం తెలిపారు. విద్యార్థులను పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిల్‌కుమార్, పీఈటీ ఎం శేఖర్, బి.అనిల్, కరాటే మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.